పుష్ప 2 భారీ విజయంతో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి వస్తున్న అప్‌డేట్స్ అభిమానుల అంచనాల్ని పెంచేస్తున్నాయి. సినిమాకు బలం చేకూర్చేందుకు ఇతర అగ్రనటుల్ని కూడా అట్లీ రంగంలో దింపనున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అల్లు అర్జున్-అట్లి సినిమాపై క్రేజీ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఎన్నడూ చూడని పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. ఈ రోల్ చూస్తే అభిమానులు వెర్రెక్కిపోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే పుష్ప 2 భారీ విజయం తరువాత పాన్ వరల్డ్ స్థాయికి మారిన అల్లు అర్జున్‌ని దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన, శక్తివంతమైన స్టోరీ లైన్ రాసుకున్నాడు అట్లీ. అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఒకరు దీపికా పదుకోన్ కాగా మరో ఇద్దరి పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటితం కాలేదు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా పేర్లు మాత్రం విన్పిస్తున్నాయి.
అల్లు అర్జున్‌తో ఇతర అగ్ర నటీనటులు
అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమాలో టాలీవుడ్ అగ్ర నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో కన్పించనుంది. మరోవైపు తమిళ నటుడు విజయ్ సేతుపతి సైతం ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కన్పిస్తాడట. అల్లు అర్జున్ రోల్ ఎవరూ ఊహించని విధంగా ఎలా ఉంటుందో విజయ్ సేతుపతి రోల్ కూడా అదే విదంగా ఉండబోతోందని టాక్. ప్రస్తుతం ముంబై పరిసరాల్లో సినిమా షూటింగ్ జరుగుతోంది. పుష్ప 2 రేంజ్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో, అత్యున్నతమైన వీఎఫ్ఎక్స్ , గ్రాఫిక్స్ ఉండేలా ప్రయత్నిస్తున్నారు. అందుకే హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాలో పని చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది అంటే 2026 ఆఖరుకి సినిమా విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచనగా ఉంది.