సమంత నటిస్తోన్న మైథిలాజికల్ చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం విజువల్ వండర్ గా కట్టిపడేస్తోంది. దర్శకుడు గుణశేఖర్ తనదైన గ్రాఫిక్ మాయాజాలంతో ఈ సినిమాని ఆసక్తికరంగా రూపొందించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు, మేనకగా మధుబాలతో పాటు సీనియర్ నటి గౌతమి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక ఇదే సినిమాతో అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ కూడా సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.
సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి అల్లు అర్హ సుపరిచితమే. ఎప్పటికప్పుడు తన అల్లరితో ఫోటోలు, వీడియోలను పోస్టు చేస్తుంటారు అల్లు స్నేహ. అప్పుడప్పుడు అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్ లో కూడా అర్హ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలో ఎలాగో తన అల్లరితో, అందంతో తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్న అర్హ.. ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. శాకుంతలం సినిమాలో చిన్న క్యారెక్టర్ ద్వారా అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా డెబ్యూకి రెడీ అయ్యింది. తాజాగా రిలీజైన శాకుంతలం ట్రైలర్ లో శకుంతల కుమారుడు భరతుడి చిన్ననాటి క్యారెక్టర్ లో సింహంపై కూర్చొని ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుండగా.. అల్లు అర్హని చూసి బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో క్యూట్ గా ఉందంటూ వీడియోని, అర్హ గెటప్ ని వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దుశ్యంతుడు, శకుంతలకు సంబంధించి పురాణ ప్రేమకథ నేపథ్యంలో వీరికి భరతుడు అనే యువరాజు జన్మిస్తాడు. ఇప్పుడదే భరతుని చిన్ననాటి పాత్రను అర్హ పోషిస్తుండటం విశేషం. అదే భరుతుడి పేరు రూపాంతరం చెంది.. మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చిందనేది ఉవాచ. మరి శాకుంతలం ట్రైలర్ లో అర్హ ఎంట్రీ గురించి, శాకుంతలం ట్రైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.