బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీత పాత్రతో అందరి మెప్పు పొందారామె. అలాంటి అలియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఒక్కో సినిమాతో నంబర్ వన్ ప్లేసుకు ఆమె మరింత చేరువవుతున్నారు. వరుస హిట్లతో టాప్ ఛెయిర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారామె. ‘గంగూబాయి కతియావాడి’ మూవీతోనూ మరో విజయాన్ని అకౌంట్లో వేసుకున్నారు. ఈ ఫిల్మ్ సక్సెస్‌తో లేడీ ఓరియంటెడ్ మూవీ మేకర్స్‌కు ఆమె ఫస్ట్ ఆప్షన్ అయిపోయారు. ఇక, రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లవడం, ఆ తర్వాత ఈ జంటకు ఒక పాప పుట్టడం సంగతి తెలిసిందే. ఇలా, కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లోనూ హ్యాపీగా ఉన్నారు అలియా. అలాంటి ఆమె ఇంట్లో ఒక విషాదం చోటుచేసుకుంది.
అలియా భట్ తాత నరేంద్రనాథ్ రజ్దాన్ కన్నుమూశారు. అలియా తల్లి సోని రజ్దాన్ నాన్న అయిన నరేంద్రనాథ్ వయసు 93 ఏళ్లు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న నరేంద్రనాథ్ గురువారం కన్నుమూశారు. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అలియా తాత తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అలియా ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన తాత ఇక లేరనే వార్తను ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఫ్యాన్స్‌కు అలియా తెలియజేశారు. ఇది తమ కుటుంబానికి బాధాకరమైన వార్త అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, సినిమాల విషయానికొస్తే.. అలియా ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీలో నటిస్తున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ రూపొందిస్తున్నారు.