హీరోయిన్ గా ఆలియా భట్ ఫుల్ ఫామ్ లో ఉంది. కొన్ని నెలల ముందే పుట్టిన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి టైంలో కొందరు వ్యక్తులు ఆమెకి షాకిచ్చారు.
సెలబ్రిటీలు, వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటం చూపిస్తుంటారు. ఆయా హీరో లేదా హీరోయిన్స్ ఆస్తుల దగ్గర నుంచి పుట్టిన పిల్లల వరకు ప్రతి విషయాన్ని అందరి కంటే ముందే చూసేయాలని అనుకుంటూ ఉంటారు. ఇదే అదనుగా కొందరు ఫొటో గ్రాఫర్లు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. యూట్యూబ్ లో వ్యూస్, ఇన్ స్టాలో లైక్స్ కొట్టేయాలని విపరీతంగా చేస్తుంటారు. అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఆలియా భట్ విషయంలో జరిగింది. మరీ దారుణంగా ప్రవర్తించేసరికి ఆమె అస్సలు తట్టుకోలేకపోయింది. అసలేం జరిగిందో చెబుతూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్టులు పెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకున్న భామ ఆలియా భట్. ‘స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్’తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకుంది. ‘RRR’ లాంటి సెన్సేషనల్ మూవీలోనూ సీతగా నటించి తెలుగు వాళ్లకు దగ్గరైంది. అలా కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్న ఆలియా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ని గతేడాది పెళ్లి చేసుకుంది. నవంబరులో బాబు కూడా పుట్టాడు. రీసెంట్ గా చిన్నారి ఫొటోలు కొన్నింటిని ఆలియా ఇన్ స్టాలో షేర్ చేసింది కూడా.
ఇక్కడివరకు బాగానే ఉంది. ఫొటోలు ఎవరైనా చూస్తారు. వీడియోలు తీస్తే ఎలా ఉంటుంది అనుకున్నారో ఏమో గానీ ఏకంగా ఆలియా ఇంట్లోకి సీక్రెట్ గా కెమెరాలు పెట్టేశారు. ఈ విషయాన్ని ఆమె గమనించడం, వాళ్లకు షాకివ్వడం రెండు జరిగిపోయాయి. ‘నేను ఎంతో అద్భుతంగా మధ్యాహ్నం టైంని ఇంట్లో గడుపుతున్నాను. అప్పుడు నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించి మొత్తం చెక్ చేశాను. మా పక్కింటి టెర్రస్ పై ఇద్దరు వ్యక్తులు చేతిలో కెమెరాలు పట్టుకుని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఇది మా ప్రైవసీకి భంగం కలిగించడమే ఇక చాలు లిమిట్ క్రాస్ చేశారు. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా?’ అని ఆలియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆలియాకు అండగా నిలుస్తూ అర్జున్ కపూర్, అనుష్క శర్మ తదితరులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. మరి ఏకంగా ఆలియా ఇంట్లోకే కెమెరాలు పెట్టడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.