ప్రదీప్ మాచిరాజు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఎవరూ ఉండరు. రేడియో జాకీగా కెరీర్ ను ప్రారంభించిన ప్రదీప్.. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా మారి… తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన పంచ్ లతో బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజుకి లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. అనేక సినిమాలో నటించి వెండి తెరపై కూడా మెరిశారు. అయితే “30 రోజుల్లో ప్రేమించటం ఎలా?” అనే సినిమాతో హీరోగా వెండితెరపై కనిపించారు. ఇలా మేల్ యాంకర్స్ లో టాప్ లో దూసుకెళ్తున్న ప్రదీప్ మాచిరాజు గురించి తాజాగా ఓ టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ నుంచి ప్రదీప్ వెళ్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ మాటలను అలీనే స్వయంగా ఓ షోలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
బుల్లితెరపై యాంకరింగ్ లో చాలా కాలంగా అమ్మాయిలే హవాను చూపిస్తున్నారు. గ్లామర్ ప్రపంచం కావడంతో తమ అందచందాలతో కనువిందు చేస్తూ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అద్భుతమైన టాలెంట్‌తో సత్తా చాటుతూ.. చేతి నిండా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు ప్రదీప్ మాచిరాజు. అదే సమయంలో లేడీ యాంకర్లకు పోటీ ఇవ్వడంతో పాటు టాప్ స్టేజ్‌లో వెలుగొందుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్‌ను సైతం సొంతం చేసుకున్నారు. తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న “డ్రామా జూనియర్స్” అనే షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన కామెడీ పంచ్ లతో ప్రదీప్.. షోలో హంగామా చేస్తున్నారు. పిల్లల కామెడీతో, ప్రదీప్ యాంకరింగ్ తో ఈ షో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించింది.
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న దిల్ రాజు.. అక్కడ నుంచే పోటీ చేస్తారట!తాజాగా ఈ షో నిర్వహకులు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. సింగర్ సునీత, నటుడు అలీ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిలు ఈ షోకి జడ్జీలుగా వ్యవహారించారు. ఈ క్రమంలో “నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా” అనే పాటను ఓ చిన్నారి పాడాడు. సునీత కూడా ఆ చిన్నారితో పాటు శృతి కలిపింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న అందరితో పాటు అలీ కూడా ఎమోషన్ అయ్యారు. ఈ సందర్భంగా అలీ ఓ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ” మధ్యలో నువ్వు అలా నిల్చోని పిల్లలు, సునీత అలా పాడుతుంటే… ఇక ఇండస్ట్రీ నుంచి ప్రదీప్ వెళ్లిపోతున్నాడు..” అని అలీ అంటారు. ఆయన మాటలు పూర్తి కాకుండానే ప్రోమో ఎండ్ అవుతోంది.
ఇదీ చదవండి: సుకుమార్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు!
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. “నిజంగానే.. ప్రదీప్ ఇండస్ట్రీ నుంచి వెళ్తుండవచ్చు”అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, ఇది టీఆర్పీ స్టంట్ లో భాగమే అంటూ కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.