ఒక స్టార్ యాక్టర్ లేటు వయసులో తండ్రి కానున్నారు. ఆ నటుడి వయసు 83 ఏళ్లు కాగా.. ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఏజ్ 29 కావడం గమనార్హం.
జీవితంలో ఏదైనా సరే ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరిగితేనే బాగుంటుంది. పెళ్లి, పిల్లల విషయంలోనూ అంతే. చదువులు పూర్తయి ఉద్యోగం లేదా వ్యాపారంలో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. పెద్దలు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు పెళ్లి తంతు కానివ్వాలని అంటారు. కానీ ఈ రోజుల్లో లేటు వయసులో మ్యారేజ్ చేసుకోవడం, పిల్లల్ని కనడం గురించి వార్తల్లో చూస్తున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇలాంటి న్యూస్ ఎక్కువగా రావడాన్ని గమనించొచ్చు. తాజాగా ఒక సినీ ప్రముఖుడి జీవితంలో ఇదే జరిగింది. అద్భుతమైన నటనా పటిమతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఒక స్టార్ యాక్టర్ లేటు వయసులో తండ్రి కానున్నారు. ఆయన మరెవరో కాదు.. హాలీవుడ్ సీనియర్ నటుడు, ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ అల్ పసినో. ఆయన గత కొంతకాలంగా నిర్మాత నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నారు.
అల్ పసినో-నూర్ అల్ఫాల్లాలు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అవుతున్నారు. లేటు వయసులో అల్ పసినో తండ్రి కాబోతున్నారనే వార్త వరల్డ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అల్ పసినో వయసు 83 కాగా.. ఆయన గర్ల్‌ఫ్రెండ్ వయసు 29 ఏళ్లు కావడం గమనార్హం. వీళ్లిద్దరూ ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారని హాలీవుడ్ టాక్. వారు ఎప్పుడూ తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరో నెల రోజుల్లో నూర్ అల్ఫాల్లా పండంటి బిడ్డకు జన్మను ఇవ్వనున్నారనే విషయాన్ని ఆమె సన్నిహితులు ధృవీకరించారు. ఇక, అల్ పసినో పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయనకు నూర్ అల్ఫాల్లాతో పుట్టే బిడ్డ నాలుగో సంతానం అవుతుంది. గతంలో జాన్ టర్రాంట్తో రిలేషన్ కారణంగా పుట్టిన 33 ఏళ్ల కూతురు ఉంది. అలాగే మాజీ గర్ల్‌ఫ్రెండ్ బేవర్లీ డీ ఆంజెల్లోతో ఇద్దరు కవల పిల్లలూ ఉన్నారు.
BREAKING: 82-year-old Al Pacino is expecting his fourth child with 29-year-old girlfriend Noor Alfallah 🎉 pic.twitter.com/hPS7s49ivD
— Daily Loud (@DailyLoud) May 31, 2023