సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి, అక్కినేని హీరోలకు ఎంతటి గౌరవం, ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా కింగ్ నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. కింగ్ నాగ్ కి నటవారసులుగా నాగచైతన్య, అఖిల్ సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అయితే.. నాగచైతన్య – అఖిల్ లకు తండ్రి నాగార్జునే. అయినప్పటికీ మదర్స్ వేరనే సంగతి తెలిసిందే.
దగ్గుబాటి లక్ష్మీగారికి నాగచైతన్య జన్మించగా.. అమలకు అఖిల్ జన్మించాడు. చిన్నతనం నుండి నాగచైతన్య చెన్నైలో తన తల్లి వద్దే పెరిగాడు. ఇక్కడే హైదరాబాద్ లో నాగార్జున, అమల వద్ద అఖిల్ పెరిగాడు. అయితే.. తాజాగా నాగచైతన్య – అతని తల్లి దగ్గుబాటి లక్ష్మిల గురించి అమల కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. “చిన్నప్పుడు చెన్నైలో ఉన్న చైతన్య సెలవులు ఉన్నప్పుడే హైదరాబాద్ కి వచ్చేవాడు. చిన్నతనం నుండి చైతన్యను వాళ్ల అమ్మే ఎంతో పద్దతిగా పెంచింది.
రెండు మూడు నెలలకు ఒకసారి హైదరాబాద్ కి వచ్చి తన తండ్రి నాగార్జునతోనే ఎక్కువ టైమ్ గడిపేవాడు. వాళ్లిద్దరూ ఎంచక్కా ముచ్చట్లు పెట్టుకునేవారు. అఖిల్ అయితే అన్నయ్య నాగచైతన్య ఎప్పుడెప్పుడు హైదరాబాద్ కి వస్తాడా అని వెయిట్ చేస్తుండేవాడు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. చైతన్య ఇంటికి వచ్చాడంటే చాలు.. అఖిల్ కి నేను గుర్తుండను. అమ్మ అవసరం లేదు. ఇద్దరిలో అఖిల్ బాగా అల్లరి చేసేవాడు. చైతన్య కామ్ గా ఉండేవాడు” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు అమల. ప్రస్తుతం నాగచైతన్య – వాళ్ళమ్మ గురించి అమల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అమల మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.