ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ సమంత గురించే మాట్లాడుకుంటోంది. ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సెలబ్రిటీలతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన సమంత అనారోగ్యానికి గురైందని తెలిసి.. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సమంత అనారోగ్యంపై ఆమె మాజీ భర్త అక్కినేని నాగచైతన్య తమ్ముడు అఖిల్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
మొన్నటివరకూ సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోవడంతో ఆమె ఆరోగ్యం గురించి ఎన్నో రూమర్స్, పుకార్లు పుట్టుకొచ్చాయి. కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని.. అందుకే బయటికి రావట్లేదంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. అదీగాక రీసెంట్ ఆమె చేసిన యాడ్ లో కూడా డల్ గా కనిపించడంతో.. కాస్మొటిక్ సర్జరీ కోసమే ఫారెన్ వెళ్లిందని కామెంట్స్ వినిపించాయి. కానీ.. తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని, ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టేసరికి అందరూ విచారం వ్యక్తం చేశారు. అయితే.. సమంత అనారోగ్యంపై ఎంతమంది సెలబ్రిటీలు రెస్పాండ్ అయినా.. అక్కినేని అఖిల్ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది.
సమంత అనారోగ్యంపై అక్కినేని అఖిల్ స్పందిస్తూ.. “అందరి ప్రేమ, స్ట్రెంత్ నీకే డియర్ సామ్” అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం అఖిల్ చేసిన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నాగచైతన్య ఇంకా స్పందించలేదు ఏంటా అని చూస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉండగా.. తెలుగు సినిమాల పరంగా సమంత చివరిసారిగా జాను సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ యశోద మూవీ.. నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది. కానీ.. ఇంతలోనే సమంత గురించి బ్యాడ్ న్యూస్ తెలిసేసరికి.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రార్థిస్తున్నారు.