నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా అఖండ. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించగా, జగపతిబాబు, శ్రీకాంత్, కీలక పాత్రలు నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అఖండ మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది.
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా గత నెలన్నరగా బాక్సాఫీస్ బరిలో సోలోగా సందడి చేస్తున్నాడు బాలయ్య. తొలిరోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి పది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ ను అందుకోగా, ఇప్పుడు 50 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరింది. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి.
#Akhanda completes 50 Days in 103 Theatres. Purest Mass Rampage! 👏🏻💥
Congratulations ‘Natasimham’ #NandamuriBalakrishna Gaaru, #BoyapatiSreenu Gaaru, @MusicThaman Baava & the entire team! 🎉🎉@ItsMePragya @dwarakacreation #MiryalaRavinderReddy pic.twitter.com/13Yf0AUBrs
— Gopichandh Malineni (@megopichand) January 20, 2022
50 రోజులు అనే మాట మరిచిపోయి చాలా రోజులైపోయింది. కానీ అఖండ సినిమాతో ఆ విషయాన్ని గుర్తు చేసారు బాలయ్య. అందులోనూ దాదాపు 24 సెంటర్స్‌లో నేరుగా 50 రోజులు నుంచి ఆడుతోంది. భారీ అంచనాలతో వచ్చిన అఖండ.. వాటిని నిలుపుకోవడమే కాకుండా అంచనాలకు మించి వసూలు చేస్తోంది. దైవత్వాన్ని జోడించి.. ఎమోషన్ కూడా బాగానే పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. కరోనా తర్వాత ఓ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం సినీ ఇండస్ట్రీకి శుభవార్తగానే చెప్పుకోవాలి.
𝙱𝙾𝚇 𝙾𝙵𝙵𝙸𝙲𝙴 𝙱𝙾𝙽𝙰𝙽𝚉𝙰 𝐍𝐀𝐍𝐃𝐀𝐌𝐔𝐑𝐈 𝐁𝐀𝐋𝐀𝐊𝐑𝐈𝐒𝐇𝐍𝐀 𝚄𝙻𝚃𝙸𝙼𝙰𝚃𝙴 𝚁𝙾𝙰𝚁 🦁
𝟐𝟎𝟎 𝐂𝐑 Gross | 𝟓𝟎 Days 𝟏𝟎𝟑 Theatres 🔥#Akhanda50daysJathara 🥁#Akhanda #AkhandaMassJathara #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @ItsMePragya pic.twitter.com/8ZEpXPVp6x
— Nandamurifans.com (@Nandamurifans) January 20, 2022