చిత్ర పరిశ్రమలో కథలు.. ఒక హీరో దగ్గరి నుండి ఇంకో హీరో దగ్గరికి వెళ్లడం మామూలే. దర్శకులు చెప్పే కథలు ముందుగా అనుకున్న హీరోలకు నచ్చకపోవడం వల్లనో.. లేక ఆయా హీరోలకు డేట్స్ కుదరకనో.. కథలు వేరే హీరోల వద్దకు వెళ్తుంటాయి. ఇంకో హీరోతో తీశాక.. సినిమాలు పెద్ద హిట్ అయితే మాత్రం.. ఆ సినిమాని ముందుగా మిస్ చేసుకున్న హీరోలు ఆలోచిస్తారో లేదో గాని.. ఏదొక రోజు విషయం తెలిసి మిస్ చేసుకున్న హీరోల ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతారు.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో కథలు.. ఒక హీరో దగ్గరి నుండి ఇంకో హీరో దగ్గరికి వెళ్లడం మామూలే. దర్శకులు చెప్పే కథలు ముందుగా అనుకున్న హీరోలకు నచ్చకపోవడం వల్లనో.. లేక ఆయా హీరోలకు డేట్స్ కుదరకనో.. కథలు వేరే హీరోల వద్దకు వెళ్తుంటాయి. ఆఖరికి దర్శకులు రాసుకున్న కథలు.. ఒకటి రెండు మార్పులు జరిగో, లైన్ బాగుంటే ఓకే అయిపోవడమో జరుగుతుంటాయి. ఆ విధంగా ఒకరితో తీయాలనుకున్న కథలు ఇంకో హీరోతో తీశాక.. సినిమాలు పెద్ద హిట్ అయితే మాత్రం.. ఆ సినిమాని ముందుగా మిస్ చేసుకున్న హీరోలు ఖచ్చితంగా ‘చేసుంటే బాగుండు’ అని ఓసారైనా ఆలోచిస్తారు. మరి హీరోలు ఆలోచిస్తారో లేదో గాని.. ఏదొక రోజు విషయం తెలిసి మిస్ చేసుకున్న హీరోల ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతారు.
కొన్నిసార్లు మంచి అవకాశాలు అలా వచ్చి వెళ్తుంటాయి. అది మంచి కథ అయినప్పటికీ.. ఏదొక కారణం చేత మిస్ అవ్వాల్సి ఉంటుంది. అలా 2021లో ఓ బ్లాక్ బస్టర్ మాస్టర్ మూవీ విషయంలో జరిగిందట. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఆ ఏడాది కోలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. అయితే.. ముందు నుండే సాంగ్స్, టీజర్ లతో అంచనాలు పెంచిన మాస్టర్ సినిమా.. రిలీజ్ అయ్యాక విజయ్ కి, విజయ్ సేతుపతికి తెలుగులో మార్కెట్ ని డెవలప్ చేసిందని చెప్పాలి.
ఇక ఖైదీ, విక్రమ్ సినిమాలతో ‘లోకి సినిమాటిక్ యూనివర్స్'(LCU)ని క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేష్.. ఇప్పుడు లియో మూవీతో దళపతి విజయ్ ని తన సినిమాటిక్ యూనివర్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మాస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. మాస్టర్ బిగ్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు లియోపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే.. మాస్టర్ సినిమా కథ ముందుగా హీరో అజిత్ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును.. ఖైదీ సక్సెస్ తర్వాత లోకేష్ కనకరాజ్.. మాస్టర్ కథను ముందుగా అజిత్ కే వినిపించాడట. కానీ.. అప్పుడు అజిత్.. డైరెక్టర్ హెచ్. వినోద్ తో ‘వలిమై’ కమిట్ అయి ఉన్నాడు. అలా కథ నచ్చినా డేట్స్ కుదరలేదట.
దీంతో వెంటనే ఆలస్యం చేయకుండా లోకేష్.. మాస్టర్ కథను దళపతి విజయ్ కి చెప్పగా.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పాడట. ఆ విధంగా మాస్టర్ సినిమాని అజిత్ మిస్ అయిపోయాడు. అదే సినిమా విజయ్ కి ఊహించని విజయాన్ని అందించి.. ఆయన క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే.. తాజాగా ఈ మాస్టర్ మూవీ విషయానికి సంబంధించి ఓ ఓల్డ్ న్యూస్ పేపర్ ప్రింట్ చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో దళపతి విజయ్ కాకుండా ప్రొఫెసర్ క్యారెక్టర్ ని అజిత్ చేసుంటే సినిమా మరింత బెటర్ గా ఉండేదని.. కానీ.. అజిత్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. మాస్టర్ మూవీ సక్సెస్ తర్వాత లోకేష్ కనకరాజ్.. కమల్ హాసన్ తో విక్రమ్ అనౌన్స్ చేశాడు. కానీ.. విక్రమ్ షూటింగ్ దశలో ఉండగానే దళపతి విజయ్ తో రెండో మూవీ అనౌన్స్ చేశాడు లోకేష్. ఇప్పుడదే లియో. ఈ సినిమాతో విజయ్ లోకి సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతున్నాడు. ఆల్రెడీ ఈ యూనివర్స్ లో కార్తీ, కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ చేరిపోయారు. నెక్స్ట్ విజయ్ చేరతాడు. సో.. మాస్టర్ సినిమా కథను అప్పుడే అజిత్ ఓకే చేసుంటే.. ఇప్పుడు లోకేష్ లియోగా అజిత్ ని అనౌన్స్ చేసేవాడేమో అని భావిస్తున్నారు ఫ్యాన్స్. కానీ.. చూడాలి ఫ్యూచర్ ‘ఎల్‌సియూ’లో అజిత్ అడుగు పెడతాడేమో! ప్రెజెంట్ అజిత్.. డైరెక్టర్ మగిళ్ తిరుమేనితో తన 62వ మూవీ చేస్తున్నాడు. మరి మాస్టర్ కథ అజిత్ చేసుంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Little flashback for the day :
Lokesh approached AK first with Master script.
Thank god he escaped from that mokka script. #AK62 pic.twitter.com/rKjXQGV5qs
— Trollywood (@TrollywoodX) February 19, 2023