ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రేమించుకుంటున్నారంటూ నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరి ప్రేమ గురించి గట్టిగానే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి గురించి ప్రేమ వార్తలు బయటకు రావటానికి కారణం ఐశ్వర్య పెట్టిన ఓ పోస్ట్. నిన్న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్జున్ దాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ఓ లవ్ సింబల్ కూడా పెట్టారు. దీంతో ఆ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరి మధ్యా లవ్ ట్రాక్ నడుస్తోందన్న ప్రచారం జరగటం మొదలైంది.
ఐశ్వర్య ఇద్దరి ఫొటోను పెట్టి ప్రేమ గురించి చెప్పకనే చెప్పందని అనుకున్నరందరూ. మీడియా సైతం ఈ ఫొటోపై చాలా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రేమ వార్తలపై ఐశ్వర్య స్పందించింది. ఈ మేరకు గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టింది. ‘‘ నేను పెట్టిన ఆ పోస్ట్ ఇంత రచ్చకు దారి తీస్తుందని నేను అనుకోలేదు. మేము ఇద్దరం కలిశాం.. అప్పుడు ఓ ఫొటో తీసుకున్నాం. అందులో అంతకంటే ఏం లేదు. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.. నిన్నటినుంచి నాకు ఎడతెరపి లేకుండా మెసేజ్‌లు చేస్తున్న అర్జున్ దాస్ ఫ్యాన్స్ అందరూ నిశ్చింతగా ఉండండి.
అతడు పూర్తిగా మీవాడే’’ అని స్పష్టం చేసింది. కాగా, మలయాళంలో సినిమా కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సౌత్ భాషలన్నిటిలోనూ సినిమాలు చేస్తున్నారు. గతేడాది రిలీజైన గాడ్సే, అమ్ము, మట్టికుస్తీ సినిమాలతో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక, అర్జున్ దాస్ విషయానికి వస్తే.. ఖైదీ సినిమాలో విలన్ క్యారెక్టర్‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్టర్, విక్రమ్ సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నారు. మరి, ప్రేమ పుకార్లపై ఐశ్వర్య క్లారిటీ ఇచ్చిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.