ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ మరో వినూత్నమైన కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’ పేరిట ఒక సరికొత్త కార్యక్రమాన్ని పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఎన్నో విభిన్న కార్యక్రమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆహా ఇప్పుడు ఇప్పుడు అనిల్ రావిపూడితో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన కొత్త ప్రోమోని కూడా విడుదల చేసింది. అన్‌స్టాపబుల్, షెఫ్ మంత్రా వంటి షోలను సక్సెస్ చేసుకుని.. ఇప్పుడు ఈ కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ని కూడా నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఈ కార్యక్రమం ప్రోమో ఎలా ఉంది? అసలు ఎపిసోడ్లు విడుదలైన తర్వాత ఎలా ఉండబోతోంది? అనే విషయాలను సమీక్షిద్దాం.
వాళ్ల కాన్సెప్ట్ ని రిప్రెజెంట్ చేసే విధంగా టైటిల్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడియన్స్ ని ఇన్వెస్టెర్స్ అన్నారు, కమీడియన్లను స్టాక్స్‌గా, అనిల్ రావిపూడిని ఛైర్మన్ గా పెట్టారు. బుల్లితెర స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి ఈ కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరించనున్నారు. అంటే వీళ్ల ఉద్దేశం.. ఎవరైతే బాగా నవ్వించి ఇన్వెస్టర్ల మన్ననలు పొందుతారో, ఎవరు వారిని కడుపుబ్బా నవ్విస్తారో వారిపై ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని కామెడీ షోలలో ఒకటే రూల్ ఉండేది. ఏంటంటే.. ఇద్దరో ముగ్గురో సెలబ్రిటీలను కూర్చోబెట్టి వారికి స్కోర్ కార్డులు ఇచ్చి లాస్ట్ లో మార్కులు ఇవ్వమనేవారు. కానీ, ఈసారి నేరుగా ప్రేక్షకుల చేతికి ఫోన్లు ఇచ్చి వారిని ఎవరు బాగా నవ్వించారో వారిని ఎంపిక చేసుకోండని చెప్పడం చాలా కొత్తగా ఉంది. ఈ షో మొత్తంలో ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా మెప్పించగలదు.
ఈ షోలో కొన్ని రౌండ్స్ ని కూడా ప్లాన్ చేశారు. మామూలుగా కామెడీ షోలలో ఒకరి తర్వాత ఒకళ్లు స్కిట్స్ చేస్తూ ఉంటారు. కానీ, ఈ షోలో మాత్రం కొన్ని రౌండ్స్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. మొదటి రౌండ్ అట్లుంటది మనతోని అని చెప్పారు. ఈ రౌండ్‌లో వాళ్లు అనుకున్న స్కిట్స్ చేయడం, లేదా వారికి ఏదైనా కాన్సెప్ట్ ఇస్తే దానిపై స్కిట్స్ చేసే విధంగా కనిపిస్తోంది. ఈ రౌండ్లో స్టాక్స్ గా చెప్పుకున్న కమీడియన్స్ వారి వారి కాన్సెప్ట్‌లను ప్రేక్షకుల ముందు ఉంచుతారు. రెండో రౌండ్.. సర్‌ప్రైజెస్ ఆఫ్ పదా చూసుకుందాం అని చెప్పారు. ఈ ప్రోమో ప్రకారం ఈ రౌండ్‌లో కమీడియన్స్ తో ఏదైనా గేమ్స్, క్విజ్, సరదా కార్యక్రమాలను చేయించేలా కనిపిస్తోంది. అంటే ఎప్పుడూ ఒకేలాంటి స్కిట్స్ కాకుండా స్పాంటేనియస్‌గా కామెడీని పండించేందుకు స్కోప్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇంక లాస్ట్‌లో ఆడియన్స్ వారికి నచ్చిన స్టాక్స్ ని కొనుగోలు చేయడం అనమాట. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో.. వారిని లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది డేగా ప్రకటిస్తారు. అంటే ఆ ఎపిసోడ్‌కి వాళ్లే విన్నర్ అనమాట.
ఇంక ఈ షో గురించి ఓవరాల్‌గా చెప్పుకోవాలి అంటే.. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఎన్ని కామెడీ షోస్ ఉన్నా కూడా ఇది భిన్నంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆ షోకి ఛైర్మన్‌గా ఉండేందుకు అనిల్ రావిపూడిని ఒప్పించడం గొప్ప విషయం అని చెప్పాలి. షో మొత్తానికి అనిల్ రావిపూడి సెంటర్ ఎట్రాక్షన్ గా చెప్పొచ్చు. ఆయన గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదు.. డాన్సర్, యాక్టర్, మంచి కమీడియన్ కూడా. ఈ ప్రోమోలో ఆల్రెడీ ఆయనలో ఉన్న కమీడియన్‌ని పరిచయం చేశారు కూడా. ఇంక కమీడియన్ల విషయానికి వస్తే.. పటాస్, కామెడీ స్టార్స్, అదిరింది వంటి షోస్ చూసిన వారికి కాస్త రొటీన్ ఫేసెస్ అనే ఫీలింగ్ కలగచ్చు. కాకపోతే కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఆదరణ విషయంలో ఢోకా ఉండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ షో డిసెంబర్ 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. వారానికి ఒక ఎపిసోడ్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.