నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి.. బోయపాటి మాస్ పల్స్ తోడవడం, ఈ కాంబోకి థమన్ టాప్ లేచిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో అఖండ మూవీ మాస్ జాతరలా తయారైంది. ఇక ఇందులో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించడం విశేషం. బాలయ్య నటించిన ఈ అఘోరా పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచిపోతున్న అఖండ ధియేటర్స్ లో ఇప్పుడు నిజమైన అఘోరాలు దర్శనం ఇవ్వడం ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో అఘోరాలు సందడి చేశారు. థియేటర్లో సినిమా చూస్తూ హల్‌చల్ చేశారు. థియేటర్‌లో అఘోరాలను చూసిన ప్రేక్షకులు ఓరేంజ్‌లో ఎంజాయ్ చేశారు. అఘోరాలు సైతం బాలయ్యకు ఫ్యాన్స్ అయిపోయారంటూ, జై బాలయ్య అని ఫ్యాన్స్ కేకలు, అరుపులతో ధియేటర్ దద్దరిల్లిపోయింది. ఇక అఖండ సినిమా అయిపోయిన తరువాత అఘోరాలు థియేటర్ వద్ద కాసేపు కూర్చున్నారు. వీరితో బాలయ్య ప్రేక్షకులు మాట్లాడారు. మీకు సినిమా నచ్చిందా అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆ అఘోరాలు శివ నామం పలుకుతూ ధియేటర్ నుండి బయటకి వెళ్లిపోవడం విశేషం. ఇలా ఒక్కసారిగా అఘోరాలు ధియేటర్ లో దర్శనం ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.