చిత్ర పరిశ్రమలో ఎంత ఒదిగి ఉంటే అంత పేరు ప్రతిష్టలు వస్తాయి. అలా కాదని ఒక్క సినిమా హిట్ కాగానే నా అంత మెునగాడు లేడు అంటూ మాట్లాడితే ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో ఈ మధ్య కాలంలో మనం చూశాం. కానీ ఓ హీరో మాత్రం ఎదిగే కొద్ది ఒదగడం అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. అతడే హీరో అడవి శేష్. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటాడని శేష్ కు మంచి పేరు ఉంది. ఇక ప్రస్తుతం హిట్ 2 చిత్రం సూపర్ సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు శేష్. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా సీనియర్ నటి రేవతి కాళ్లు మెుక్కాడు శేష్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అడవి శేష్.. టాలీవుడ్ లో విలక్షణమైన కథల ఎంపికతో విజయాలు సాధిస్తూ.. దూసుకెళ్తున్నాడు. తాజాగా హిట్ 2 మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ హీరో. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శేష్.. తాజాగా బాలీవుడ్ మూవీ అయిన ”సలామ్ వెంకీ” సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ చిత్రానికి సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ‘సలామ్ వెంకీ’ మూవీ టీమ్ ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అడవి శేష్ ముఖ్య అతిథిగా హాజరైయ్యాడు. ఈ ఈ ఈవెంట్ లో కాజోల్ పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నాడు శేష్ ఈ క్రమంలోనే తను మాట్లాడ్డం ముగిసిన తర్వాత వెళ్లే ముందు సీనియర్ యాక్టర్ రేవతి కాళ్లు మెుక్కాడు అడవి శేష్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ పెద్ద వారికి గౌరవం ఇవ్వడంలోనే గొప్పతం ఉంటుందని ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.