డార్లింగ్ ప్రభాస్. ఆరడుగుల కటౌట్. ‘బాహుబలి’ లాంటి మూవీతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కూడా సాహో, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అలాంటి హీరోతో పనిచేసే అవకాశం దొరికితే ఎలాంటి సినిమా తీయాలి? బాక్సాఫీస్ షేక్ అయితే, వందల కోట్ల వచ్చిపడే కథని చిత్రంగా తీయాలి. సినిమా క్వాలిటీ, ఔట్ పుట్ విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదు. కానీ ‘ఆదిపురుష్’ విషయంలో జరిగింది వేరు. ఆలోచన బాగానే ఉన్నప్పటికీ, గ్రాఫిక్స్ విషయంలో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ కి సంబంధించిన మరో విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రామాయణం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. తాజాగా అక్టోబరు 2న అయోధ్యలో జరిగిన వేడుకలో టీజర్ ని విడుదల చేశారు. అంతా వరకు బాగానే ఉంది. టీజర్ లో ఉపయోగించిన గ్రాఫిక్స్ గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వీఎఫ్ఎక్స్ వర్క్ దారుణంగా ఉందని విమర్శిస్తున్నారు. కార్టూన్ లో ఉపయోగిచే గ్రాఫిక్స్ తో ఈ టీజర్ నింపేశారనే కూడా అంటున్నారు. అలా అలా.. ఈ గ్రాఫిక్స్ చేసింది ఎవరా అనే దానిపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. తాజాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి సంబంధించిన ఎన్వై వీఎఫ్ఎక్స్ వాలా గ్రాఫిక్స్ సంస్థ.. ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ తో తమకేం సంబంధం లేదని నోట్ రిలీజ్ చేసింది.
‘ADIPURUSH’ CG/SPECIAL EFFECTS: NY VFXWALA ISSUES CLARIFICATION… OFFICIAL STATEMENT…#Adipurush #NYVFXwala pic.twitter.com/pZlPqENUIR
— taran adarsh (@taran_adarsh) October 3, 2022
నిజానికి ఈ గ్రాఫిక్ స్టూడియో.. హీరో అజయ్ దేవగన్ పెట్టుబడితో పెట్టిందే అయినా.. దీని బాధ్యతలు ప్రసాద్ సుతర్ అనే వ్యక్తి చూసుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ నిర్మాతల్లో ఆయన ఒకరు. గతంలో ఆయన, తమ బృందం ‘ఆదిపురుష్’ కోసం పనిచేస్తోందని పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు! ఇక నిర్మాతల్లో ఒకరు కావడంతో, అయోధ్యలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి కూడా వెళ్లారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ని టార్గెట్ చేశారు. ప్రభాస్ పరువు తీయడానికే మీరంతా కంకణం కట్టుకున్నారా అని ప్రసాద్ సుతార్ పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎన్వై వీఎఫ్ఎక్స్ వాలా స్టూడియోనోట్ విడుదల చేసి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మరి ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ పై ట్రోల్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.