ఉర్ఫీ జావేద్.. ఈ పేరుతో గ్లామర్ ప్రియులకు, నెటిజన్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటిగా బిజీ అవుదామని.. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఉర్ఫీ.. నటిగా తప్ప వేరే అన్ని కాంట్రవర్సీలలో బిజీ అయ్యింది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఈ లక్నో బ్యూటీ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. నటిగా అవకాశాల కోసం ముంబైకి వచ్చింది. కానీ.. ఆమె గురించి ముంబైకి పెద్దగా తెలియదని.. బోల్డ్ ఫోటోషూట్స్ తో తన గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేస్తోంది. ఉర్ఫీ గురించి చెప్పుకోవాలంటే.. సినిమాల గురించి కాకుండా ఆమె పెట్టే బోల్డ్ ఫోటోలపైనే మాట్లాడాలి అన్నట్లు ఫేమ్ సంపాందించుకుంది.
ఉర్ఫీ జావేద్.. ఈ మధ్యకాలంలో మోడలింగ్ లోనే కొత్త బాటలు వేసింది. ముఖ్యంగా ఇండియాలో ఎన్నడూ ఎవరూ చూడని డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ ని తీసుకొస్తోంది. అవును.. యాక్టర్ అవ్వాలనే వచ్చినప్పటికీ, ఛాన్సులు రాక బోల్డ్ ఫోటోషూట్స్ తో నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేస్తోంది. టాప్ టు బాటమ్ అన్ని అందాలను కురచ దుస్తులతో ప్రదర్శిస్తూ.. కాంట్రవర్సీ క్వీన్ అనిపించుకుంది. ఉర్ఫీకి పబ్లిక్ ప్లేస్.. ఇల్లు అనే తేడా లేదట. ఎక్కడున్నా ఫోటోలకు ఫోజులిచ్చి.. ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడమే తెలుసు అంటోంది. ఇక డ్రెస్సింగ్ విషయంలో రెగ్యులర్ గా ట్రోల్స్ ఫేస్ చేయడం ఉర్ఫీకి మామూలే అయిపోయింది. పైగా కొన్నిచోట్ల ఈమెపై కేసులు కూడా నమోదయ్యాయి.
అవేం పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే.. తాజాగా తాను ఎందుకు అలా విచిత్రంగా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తుందో.. ఎందుకు పూర్తిగా ఒంటినిండా బట్టలు వేసుకోదో కారణం చెప్పింది. తన ఇన్ స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసిన ఉర్ఫీ.. “చూశారా.. ఇదీ నా ప్రాబ్లమ్. నేను ఉన్ని దుస్తులు లేదా ఒంటినిండా వేసుకున్నప్పుడల్లా.. ఇలా అలర్జీ వస్తుంది. నాకిది పెద్ద ప్రాబ్లెమ్ అయిపోయింది. ఎందుకు నేనెప్పుడూ నిండుగా బట్టలు వేసుకోనో ఇప్పుడైనా మీకు తెలిసిందా! నిండుగా వేసుకుంటే ఇదే పరిస్థితి. అందుకే నాకు బట్టలంటే అలర్జీ. నా చేతులు.. కాళ్లపై దద్దుర్లు ఎలా వచ్చాయో మీరే చూడండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉర్ఫీ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.