సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు, హీరోయిన్ లు డబ్బు సంపాదించడం కోసమే వస్తుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా వరకు అలా అనుకోవడం తప్పు అంటోంది స్టార్ హీరోయిన్ సమంత. గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది సమంత. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే తాజాగా విడుదలైన ‘యశోద’ మూవీకి డబ్బింగ్ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా కూడా మారాయి. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత తన మనోభావాలను మీడియాతో పంచుకుంది. తాను పేరు ప్రఖ్యాతలు, డబ్బు కోసం ఆరాటపడనని.. తనకు నటనే ముఖ్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ఎవరికీ తెలియని విషయాల గురించి ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు సమంత.
సమంత.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ.. మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తాజాగా విడుదలైన “యశోద” చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే క్రమంలో సమంత షేర్ చేసిన ఓ పిక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అప్పుడే బయటపడింది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని. అయితే తాను ధైర్యవంతురాలినని, ఈ వ్యాధితో పోరాడి కచ్చితంగా గెలుస్తానని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది సమంత. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత తన ఆలోచనలను, అలవాట్లను మీడియాతో పంచుకుంది.
సమంత మాట్లాడుతూ..”నేను చేసే ప్రతీ పాత్రను ప్రేమిస్తాను, అలా ప్రేమించకపోతే నేను ఆ పాత్రలో ఎలాంటి సంతోషాన్ని పొందలేను. అందుకే నాకు నేనే విమర్శించుకుని పాత్రలను ఎంపిక చేసుకుంటాను. నాకు కోపం వస్తే వెంటనే జిమ్ కు వెళ్లి నా ఇష్ట ప్రకారం జిమ్ చేస్తాను. దాంతో నాలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఇక నేను పేరు ప్రఖ్యాతల కోసమో, డబ్బు కోసమో ఆరాటపడను. నాకు అన్నింటి కన్నా నటనే ముఖ్యం” అని ఈ సందర్బంగా సమంత చెప్పుకొచ్చింది. మరికొన్ని ఆధ్మాత్మిక మాటలు సైతం ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. కాలం కలిసి రాకపోతే ఏదీ జరగదని, నీకు నచ్చినట్లుగా నువ్వు బతకాలి గానీ.. ఎవరినో ఇంప్రెస్ చెయ్యడానికి కాదు అని సమంత అన్నారు. మన తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లినప్పుడే వృత్తిలో ఎదగగలమని సమంత పేర్కొంది. చివరిగా ఉన్నదాంట్లో సంతోషానికి అలవాటు పడితే.. మనకు కావాల్సినవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయని సమంత చెప్పుకోచ్చింది.