సాధారణంగా డబ్బు సంపాదన లక్ష్యంగానే అందరూ వర్క్ చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే డబ్బు కాదు.. పేరు కోసం అంటుంటారు. ఇంకొందరు వేరే వేరే కారణాలతో వర్క్ చేస్తున్నామని చెబుతుంటారు. కానీ.. ఎటు తిరిగి అందరి లక్ష్యం డబ్బు సంపాదనే. డబ్బు సంపాదించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. బిజినెస్, ఉద్యోగాలతో పాటు ఇంటరెస్ట్ బట్టి.. డిఫరెంట్ దారులలో వెళ్తుంటారు. అయితే.. అలా డబ్బు కోసం వెళ్లే మార్గాలలో నటన, సినిమాలు కూడా ఉన్నాయనే సంగతి అందరికి తెలిసిందే. ఇదే విషయాన్నీ తాను నొక్కి చెబితే.. ఎందుకు తనను తప్పుబడుతున్నారని అడుగుతోంది హీరోయిన్ ప్రియా భవాని శంకర్.
బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియా.. తక్కువ కాలంలోనే సీరియల్స్ లో అవకాశాలు సంపాదించుకొని, సీరియల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ బుల్లితెర నుండి వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటూ.. హీరోయిన్ గా మారింది. సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం టచ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ భామ.. ప్యాషన్ కొద్దీ కాకుండా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఇండస్ట్రీలోకి వచ్చానని కుండబద్దలు కొట్టేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా.. తాను సీరియల్స్ లో కంటే సినిమాలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఇండస్ట్రీలోకి వచ్చినట్లు చెప్పేసింది. దీంతో ప్రియా మాటలను హైలైట్ చేస్తూ.. సోషల్ మీడియా కథనాలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తాయి.
ఇండియాలో పేరొందిన పెద్ద మీడియా సంస్థలు కూడా తన గురించి నెగిటివ్ గా రాసేసరికి.. తాజాగా ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యింది ప్రియా. “ఎక్కువ డబ్బు సంపాదించడానికి వచ్చాను అనడంలో తప్పేముంది? అందరూ డబ్బు కోసమే పనులు చేస్తున్నారు. ఏ మీరు కూడా డబ్బు కోసమే కదా పని చేస్తోంది.. నేనూ అంతే. ఎందుకని యాక్టర్స్ డబ్బు గురించి మాట్లాడితే తక్కువ చేసి చూస్తారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. కానీ.. ఇలా పేరుమోసిన సంస్థలు కూడా నా గురించి ఇలా రాయడం బాధాకరం” అని తేల్చేసింది. ప్రస్తుతం ప్రియా ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ బ్యూటీ గతేడాది తిరు సినిమాలో మెరిసి, రీసెంట్ గా కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. మరి ప్రియా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
🙏🏼 https://t.co/1qM68L8xBc pic.twitter.com/3Xu6wNvnQd
— Priya BhavaniShankar (@priya_Bshankar) January 19, 2023
🔷🔹🔷 pic.twitter.com/P82IqrjI69
— Priya BhavaniShankar (@priya_Bshankar) January 9, 2023