కైపెక్కించే కళ్లు..చక్కని శరీర సౌష్ణవం. అంతకుమించి అభినయం. ఏదో తెలియని ఆకర్షణతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించిన నివేతా పేతురాజ్ పెళ్లి చేసుకుంటుందట. కాబోయే భర్తను పరిచయం చేయడంతో అదృష్టం అంటే నీదే గురూ అంటున్నారు నెటిజన్లు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్‌లో బిజీగా ఉన్న నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2016లో తమిళ సినిమాతో డెబ్యూ ఇచ్చిన నివేతా మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమైంది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, విరాటపర్వం, రెడ్, పాగల్, వంటి హిట్ సినిమాలు కూడా ఈమె కెరీర్ లో ఉన్నాయి. ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవం, చక్కని కైపెక్కించే కళ్లు, ఆకట్టుకునే అభినయం ఆమె సొంతం.
అటు యాక్టింగ్ ఇటు మోడలింగ్ తో ఆకట్టుకున్న ఈ స్టన్నింగ్ బ్యూటీ కారు రేసింగ్, బ్యాడ్మింటన్ లో కూడా ప్రావీణ్యురాలు. మధురైలో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మిక్స్డ్ డబుల్స్ కేటగరీలో విజేతగా నిలిచింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ప్రేమ వ్యవహారం ఉందనే నడుస్తోందనే వార్తలు కూడా కోలీవుడ్ వీధుల్లో హోరెత్తించాయి. కానీ ఇప్పుడు కాబోయే భర్తను పరిచయం చేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసి అన్ని పుకార్లకు చెక్ పెట్టింది.
కాబోయే భర్తను పరిచయం చేసిన నివేతా పేతురాజ్
దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న రాజ్ హిత్ ఇబ్రాన్ ను పెళ్లి చేసుకోనున్నట్టు నివేతా పేతురాజ్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ ఇద్దరికీ సీక్రెట్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఇదే ఏడాది పెళ్లి చేసుకోనున్నట్టు తెలిపింది. వాస్తవానికి చాలా కాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నామని స్వయంగా నివేతా పేతురాజ్ స్పష్టం చేసింది. ఇన్ స్టా వేదికగా కాబోయే భర్తను పరియం చేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసిన నివేతా..ఇక జీవితమంతా ప్రేమమయమే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రియడు నివేతా పేతురాజ్ తో ఉన్న ఫోటోల్ని షేర్ చేస్తూ లవ్ సింబల్స్, రింగ్ ఈమోజీలు యాడ్ చేసింది. అదృష్టం అంటే నీదే గురూ అంటూ నెటిజన్లు నివేతా పేతురాజ్ కాబోయే భర్తను కామెంట్ చేస్తున్నారు.
రాజ్ హిత్ ఇబ్రాన్ తో పెళ్లి పూర్తిగా ప్రైవేట్ వేడుకగా ఉంటుందట. కేవలం కుటుంబసభ్యులు, సమీప బంధువులు మాత్రమే హాజరవుతారని నివేతా తెలిపింది. మ్యారేజ్ డేట్ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. ఇద్దరి ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది ఎంత డీప్ లవర్స్ అనేది.