టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ గాయపడింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. కాలు యాంకిల్ కు ఫ్రాక్చర్ కావడంతో.. వాకర్ సాయంతో నడుస్తోంది ఈ బ్యూటీ. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.
సోషల్ మీడియా వాడకం పెరిగాక ప్రతీ చిన్న విషాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు సెలబ్రిటీలు. వేడుకలకు సంబంధించిన ఫోటోలనే కాకుండా తమకు అయిన గాయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు కొందరు సెలబ్రిటీలు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కాలు ఫ్రాక్చర్ అయిన ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. మరి కాలుకు ఫ్రాక్చర్ అయిన ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన ‘ఒట్టేసి చెబుతున్నా’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హీరోయిన్ కనిహా. ఇక తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాంటి మరికొన్ని చిత్రాల్లో మెరిసింది ఈ మలయాళ బ్యూటీ. అనంతరం 2008లో పెళ్లి చేసుకుని, సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం కనిహా మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అందులో భాగంగానే తాజాగా ఓ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది కనిహా. అయితే ఈ ఫోటోలో కుడి కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. వాకర్ పట్టుకుని, ఫ్రాక్చర్ అయిన కాలుకు పట్టీ వేసుకుని కనిపించింది. యాంకిల్ ఫ్రాక్చర్ కారణంగా నడవలేక పోతున్నాను, బ్యాలెన్సింగ్ గా అడుగులు వేయడం నేర్చుకుంటున్నా అని రాసుకొచ్చింది కనిహా. దాంతో ఈ పిక్ ను చూసిన కొంత మంది సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమిళనాడుకు చెందిన కనిహా అసలు పేరు దివ్య వెంకట సుబ్రమణ్యం. ఇండస్ట్రీకి వచ్చాక ఆమె పేరును కనిహాగా మార్చుకుంది.