ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీమణులు అప్పుడప్పుడు వేధింపులకు గురవుతుంటారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే లేడీ యాక్టర్ల పట్ల సినిమా రంగానికి చెందిన కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
వారికి జరిగిన అన్యాయాలను బయటికి చెప్తే పరువు పోతుందని, సినిమాల్లో అవకాశాలు రావేమోనని భయపడుతూ నటీమణులు మనోవేదన అనుభవిస్తుంటారు. ఇదే కోవకు చెందిన టాలీవుడ్ నటి తనకు కూడా ఓ డైరెక్టర్ వల్ల వేధింపులకు గురయ్యానని వెల్లడించింది. అందం సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా నటించిన జ్యోతి తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. సినిమాల కంటే ముందు పలు టివి సీరియల్స్ లో నటించింది నటి జ్యోతి. రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్-1 లో కూడా పాల్గొన్నది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి పాపులర్ అయ్యింది. తెలుగులో గుడుంబా శంకర్ , ఎవడి గోల వాడిది, రంగ ది దొంగ, అందరు దొంగలే, పెళ్ళాం ఊరెళితే, గోల గోల అనే సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. నటిగానే కాకుండా ఆమె మోడల్ గా కూడా రాణించింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఓ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
పలు సినిమాల్లో రొమాంటిక్ కామెడీ రోల్స్ లో నటించి జ్యోతి, తనను వారికి ఇష్టం వచ్చినట్లుగా నటించమని చెప్తే నేను దానికి అంగీకరించనని వెల్లడించింది. ఎంత గొప్ప వ్యక్తి అయిన సరే చేయనని చెప్పింది. డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారు ఓ సీన్ విషయంలో తనను ఇబ్బంది పెట్టారని జ్యోతి చెప్పుకొచ్చింది. అయితే డైరెక్టర్ ఇవివి గారు తనకు తొట్టి గ్యాంగ్, ఎవడిగోల వాడిదిలో అవకాశం ఇచ్చారని తెలిపింది. ఆ డైరెక్టర్ నటీనటులకు కథేంటో చెప్పకుండా డైరెక్టుగా షూటింగ్ కు రమ్మంటారని తెలిపింది. కాగా కితకితలు సినిమా షూటింగ్ చేసే సమయంలో నా పాత్ర కోసం శారీ కాస్ట్యూమ్స్ ఇచ్చారని తెలిపింది.
షాట్ కి రెడీ అయిన తరువాత డైరెక్టర్ ఇవివి తనను చీర విప్పి పడుకోవాలని, పైట తీసేసి నటించాలని చెప్పారని తెలిపింది. అయితే సెట్ లో అందరి ముందు ఆ సీన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని సీన్ మార్చాలని కోరానని చెప్పింది. దీంతో ఆ డైరెక్టర్ నన్నే ఎదిరిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపింది. అలాంటి సీన్ చేయనని చెప్పేసి సెట్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలిపింది. ఆ విధంగా డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తనను ఇబ్బంది పెట్టినట్లు నటి జ్యోతి తెలిపింది.