సెలబ్రిటీల ఇంట ఎలాంటి శుభకార్యాలైనా.. సోషల్ మీడియా ద్వారా ఇట్టే తెలుసుకుంటున్నారు అభిమానులు. ఒకవేళ సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకున్నా.. ఏదో విధంగా నిమిషాల్లోనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా అలనాటి నటి, ఐటమ్ హీరోయిన్.. తన ఫ్యాన్స్ కి ఓ పెళ్లిపత్రిక ద్వారా సర్ప్రైజ్ చేసింది.
సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల ఇంట ఎలాంటి శుభకార్యాలైనా.. సోషల్ మీడియా ద్వారా ఇట్టే తెలుసుకుంటున్నారు అభిమానులు. ఒకవేళ సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకున్నా.. ఏదో విధంగా నిమిషాల్లోనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అయితే.. చాలా ఏళ్ళు ఇండస్ట్రీ నుండి దూరంగా ఉన్న సెలబ్రిటీలు ఒక్కసారిగా గుడ్ న్యూస్ తో అభిమానులను పలకరిస్తే.. ఆ కిక్కే వేరప్పా! అనుకుంటారు. తాజాగా అలనాటి నటి, ఐటమ్ హీరోయిన్ జయమాలిని.. తన ఫ్యాన్స్ కి ఓ పెళ్లిపత్రిక ద్వారా సర్ప్రైజ్ చేసింది. అదేంటీ.. జయమాలిని పెళ్లి పత్రిక షేర్ చేయడం ఏంటని అనుకోవచ్చు. కానీ.. అసలు విషయం వేరే ఉంది.
జయమాలిని అనగానే తెలుగు ప్రేక్షకులకు అలనాటి స్పెషల్ సాంగ్స్ అన్నీ ఒకసారి అలా మైండ్ లో వచ్చి పోతుంటాయి. జయమాలిని, ఆమె సోదరి జ్యోతిలక్ష్మిలను ఆడియెన్స్ అంతా ఈజీగా మర్చిపోలేరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన జయమాలిని.. డాన్సర్ గా మారి ఓవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూనే.. మరోవైపు హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఆ తర్వాత నుండి వరుసగా ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన సినిమాలలో ఆడిపాడింది. కెరీర్ లో దాదాపు 500కు పైగా సినిమాలు చేసింది. ముఖ్యంగా 80స్, 90స్ లో జయమాలిని సాంగ్ ఉందంటే చాలు.. జనాలంతా థియేటర్స్ కి పరుగులు తీసేవారంటే అర్థం చేసుకోవచ్చు. అప్పట్లోనే ఆమె క్రేజ్ ఎలా ఉండేదో!
ఇక పోలీస్ ఆఫీసర్ పార్తీబన్ తో పెళ్లి అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అప్పటినుండి ఫ్యామిలీకే టైమ్ కేటాయించిన జయమాలిని.. ప్రెజెంట్ తనయుడు శ్యామ్ హరి పెళ్లి చేసేందుకు రెడీ అయ్యింది. చెన్నైకి చెందిన ప్రియాంక అనే అమ్మాయితో మద్రాస్ వీజీపి గోల్డెన్ బీచ్ రిసార్టులో శ్యామ్ హరి పెళ్లి జరగబోతుంది. అయితే.. పెళ్లికి సంబంధించి ముందు రోజే మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కాగా.. వీరి పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు.. జయమాలిని స్నేహితులు.. ఇలా అందరూ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ హరి – ప్రియాంకల పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జయమాలిని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.