దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని. ఆ తర్వాత అమ్మడి కెరీర్ దూసుకుపోయింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుస చిత్రాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్‌లో బాల నటిగా పలు చిత్రాల్లో నటించింది. కొన్నెళ్ల పాటు.. టాప్ హీరోయిన్‌గా రాణించింది హన్సిక. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. అయితే గత కొంత కాలం నుంచి అమ్మడి కెరీర్ కాస్త వెనకబడింది. ఇక హీరో శింబుతో డేటింగ్‌లో ఉందంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు.
ఇక ఆ సంగతి పక్కన పెడితే.. డిసెంబర్ 4 హన్సిక జీవితంలో మరపురానిరోజు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది హన్సిక. తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ కతురియాను వివాహం చేసుకుంది. ఆదివారం నాడు (డిసెంబర్ 4న) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. జైపూర్ సమీపంలోని ముందోటా ఫోర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయి.. నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇక హన్సిక, సోహైల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఖరీదైన ఆభరణాలు, దుస్తుల్లో హన్సిక రాకుమారిలా మెరిసిపోయింది. ఇక మనసుపడిన వాడినే మనువాడటంతో.. ఆ సంతోషం ఆమె కళ్లల్లో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇక తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులిచ్చింది హన్సిక. ఆ తర్వాత బాణాసంచా వెలుగుల్లో పెళ్లి వేదికపైకి.. రాకుమారిలా ఎంట్రీ ఇచ్చింది. రాజసం ఉట్టిపడేలా నడుచుకుంటూ వస్తున్న హన్సిక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హన్సిక, సోహెల్‌లు సింధీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.