Geetha: 1978లో వచ్చిన ‘మన ఊరి పాండవులు’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు సీనియర్ నటి గీత. తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ చేశారు. కొన్నేళ్లు తెలుగు తెరకు దూరమైన ఆమె మళ్లీ ‘ఒక్కడు’ సినిమాతో తెలుగులోకి వచ్చారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ మంచి మంచి రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలిగా మారిపోయారు. తాజాగా, గీత ప్రముఖ టీవీ షో ‘అలీతో సరదాగా’లో పాల్గొన్నారు. తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అలీతో పాటు ప్రేక్షకులతో కూడా పంచుకున్నారు.
ఈ సందర్భంగా దివంగత నటుడు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకున్నారు. గీత మాట్లాడుతూ.. ‘‘ నేను తెలుగు ఇండస్ట్రీలోకి రావటానికి కారణం కృష్ణంరాజు గారు. ఆయన ఈ రోజు లేరంటే మనసుకు బాధగా ఉంది. అందరూ వచ్చి వెళతారు ఒకరోజు. ఉన్నట్టుండి ఆయన లేరనేసరికి ఏదోలా ఉంది’’ అంటూ ఏమోషనల్ అయ్యారు. షోలోనే ఏడ్చేశారు. గీత ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..
‘‘ కొత్తగా వచ్చిన లండన్ కోతి అని త్రిష అన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ అసలు’’.. ‘‘ ఆలీతో సరదాగా కార్యక్రమానికి గీత గారు రావడం చాలా ఆనందంగా ఉంది’’.. ‘‘ కృష్ణం రాజు గారి ఆత్మకు సద్గతి కలుగు గాక’’.. ‘‘ సర్ అలీగారు.. మూడుముళ్లబంధం సినిమాలో గీతగారు హీరోయిన్, మీరు బాలనటుడుగా చేశారు, పెద్ద మ్యూజికల్ హిట్ ఆ సినిమా ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, కృష్ణంరాజును తలుచుకుని షోలో గీత ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chandra Hass: ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై ట్రోల్స్ కి కారణం ఏమిటి?