స్నేహం అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ఇందుకు సెలబ్రీటిలు అతీతం కాదు. వారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైన సిద్ధపడుతుంటారు. సినిమాల విషయంలో కూడా స్నేహం కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైన సిద్దపడతారు కొందరు హీరో, హీరోయిన్లు. తాజాగా ఓ తమిళ నటి.. తన సహచర నటుడి కోసం ఓ సినిమాలో నగ్నంగా నటించింది. మరి.. ఆ నటి ఎవరు, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కోలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు పార్తిబన్ తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం “ఇరవిన్ నిళల్”. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ , రోబో శంకర్, ప్రియాంకా రుత్, బ్రిగిడ సాగా ఆనంద కృష్ణన్ మొదలగు వారు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ షాట్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా జూలై 15 విడుదలైంది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించిన బ్రిగిడ సాగా అనే అమ్మాయి.. నగ్నంగా నటించారు. కాగా ఇందులోని తన పాత్ర గురించి బ్రిగిడ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. బ్రిగిడ మాట్లాడుతూ.. అసిస్టెంట్ డైరెక్టరు గా ఉన్న తనను ఒక హీరోయిన్ ను చేసిన క్రెడిట్ పార్తీబన్ కే దక్కుతుందని, ఆయన కోరిక మేరకే తాను “ఇరవిన్ నిళల్” మూవీలో నగ్నంగా నటించానని చెప్పారు. ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసేందుకు వెళ్లిన.. తనను హీరోయిన్ గా పార్తీబన్ ఎంపిక చేశారని తెలిపింది.
ఈ సినిమాలో ఓ న్యూడ్ సీన్ అవసరమవుతుందని, అందుకు సినిమాను ప్రేమించే వారే కావాలని వారు చెప్పడంతో ఒప్పుకున్నానని చెప్పారు. ఈ పాత్ర చేయడానికి తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డానని, ఆ తర్వాత డెరెక్టర్ అంతా వివరించడంతో వారు ఒకే చెప్పారన్నారు. అయితే, ఈ సన్నివేశంలో అనేక టెక్నికల్ విషయాలున్నాయని, సినిమాలో చూస్తే మాత్రం అది నిజంగానే న్యూడ్ సీన్‌గా కనిపిస్తుందని ఆమె వివరించారు. కాగా న్యూడ్ సీన్‌ను బ్రిగిడ ధైర్యంగా చేసిందంటూ అందరూ మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. మరి.. ఈ తమిళ నటి బ్రిగిడి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Actress Kalyani: ఆ డబ్బు గురించే నటి కల్యాణి తన భర్తకు విడాకులు ఇచ్చిందా?
ఇదీ చదవండి: ఆ హీరోయిన్ కి.. చిన్నప్పుడు తొర్రి పళ్ళు అంటూ నెటిజన్స్ కామెంట్స్!