ప్రేమలో నిజాయతీ లేకపోతే ఆ బంధం ముందుకు సాగదు. ఇద్దరు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి. ఒక్కరే నిజాయతీగా ఉంటే బంధం బ్రేకవుతుంది.. ప్రాణంగా ప్రేమించిన వారికి అంతులేని దుఖాన్ని మిగుల్చుతుంది. తనకు ఇదే అనుభవం ఎదురయ్యింది అంటుంది ఓ నటి. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహరాలు చాలా కామన్. ఇక సెలబ్రిటీల జీవితాల్లో.. ప్రేమ, పెళ్లిళ్లకు సంబంధించి నిత్యం ఏదో వార్త వెలుగు చూస్తూనే ఉంటుంది. నచ్చితే డేటింగ్ అంటూ తిరుగతారు.. దారులు వేరయ్యాక విడిపోతారు. ఆ తర్వాత మరొకరితో జత కడతారు. సినిమా రంగంలో ఇవ్వన్నీ చాలా కామన్. అయితే కొందరు భగ్న ప్రేమికులు ఉంటారు. ప్రేమలో మోసపోతే.. వారు తట్టుకోలేరు. తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతారు. ఈ జాబితాలో తాను కూడా ఉన్నాని.. ప్రేమలో మోసపోయి.. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నాను అని తెలిపింది ఒక స్టార్ హీరోయిన్. మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తే తనను దారుణంగా మోసం చేశాడని.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు…
అందం, అభినయంతో దక్షిణాదిలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ ఆత్మిక. మీసేయ మీరుక్కు సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆత్మిక.. ఆ తర్వాత వరుసగా హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తమిళ్ స్టార్ విజయ్ సరసన కోటియిల్ ఒరువన్ చిత్రంతోపాటు.. కాటేరి, నరకాసురన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఆత్మిక. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ జోడిగా కన్నెనంబాదే చిత్రంలో నటిస్తోంది. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. దాంతో చిత్ర బృందం ప్రమోషన్ వర్క్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆత్మీక తన లవ్, బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.
ఆత్మిక మాట్లాడుతూ.. ‘‘కొన్నాళ్ల క్రితం నేను ఓ వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అయితే ఆ ప్రేమ ఎంతో కాలం నిలవలేదు. నేను తనని నిజాయతీగా ప్రేమిస్తే.. తను మాత్రం ఓ రోజు ఎలాంటి కారణం చెప్పకుండానే.. నాకు బ్రేకప్ చెప్పాడు. అసలు ఎందుకు అలా చేశాడో తెలీదు.. బ్రేకప్‌కు కారణం కూడా చెప్పలేదు. ఏం జరిగిందో, జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ బ్రేకప్ నాకు ఎంతో బాధను మిగిల్చింది. కొన్ని రోజుల పాటు రాత్రుళ్లు ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధ పడేదాన్ని. కానీ మన జీవితంలో జరిగే సంఘటన ఏదైనా మనకు మంచే చేస్తుంది. ఈ బ్రేకప్ తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉందని తెలిపింది ఆత్మిక. ఇక భవిష్యత్తులో ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని వెల్లడించింది. ఇక తనకు కాబోయే వాడు.. రగ్డ్‌గా ఉండాలని.. స్మార్ట్ పర్సన్ వద్దని.. సింపుల్‌గా, మంచి మనసు ఉన్న వ్యక్తి అయితే చాలాంది. ప్రస్తతం అందరూ డబ్బు, పేరుకు ప్రాధాన్యత ఇస్తారని.. కానీ తాను మాత్రం తొలి ప్రాధాన్యత డబ్బుకే ఇస్తానని కుండ బద్దలు కొట్టింది. ఆత్మిక బ్రేకప్ వార్తలు సోషల మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఆత్మిక ఇప్పటి వరకు ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు. కానీ ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరి ఆత్మిక చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను తెలపండి.