ప్రస్తుతం తెలుగు లో వస్తున్న చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతీ ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మూవీగా బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.
తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతీ ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మూవీగా బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలుగు లో వస్తున్న చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ సైతం భారీ కలెక్షన్లు సాధించడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు నటులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది. తాజాగా చత్రపతి ఫేమ్ షఫీ కి అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..
స్టార్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం వహించిన ఖడ్గం మూవీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు నటుడు షఫీ. మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘చత్రపతి’ మూవీలో హీరో తమ్ముడిగా విలన్ పాత్రలో నటించిన ఫషీకి మంచి గుర్తింపు వచ్చింది. షఫి తన నటనలో ఎప్పుడూ ఏదో ఒక వైవిద్యం చూపిస్తూ ఉంటారు. ఈ మద్య అడపా దడపా చిత్రాల్లో మాత్రమే నటిస్తున్న షఫీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. చిత్ర సీమలో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల్లో ఒకటైన కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడి విభాగంలో నామినేట్ అయ్యాడు ఫఫీ.
చత్రపతి మూవీ తర్వాత ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు ఫషీ. కామెడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. 20 ఏళ్ల సినీ కెరీర్ లో 50 చిత్రాలకు పైగా నటించాడు ఫషి. కాకపోతే ఏ చిత్రం కూడా అతడికి సరైన బ్రేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. తాజాగా అమిత్ రాజ్ వర్మ దర్శకత్వం వహించిన ‘3.15 AM’ షార్ట్ ఫిలిమ్ లో ఓ మద్యవయస్కుడిగా నటించాడు. ఈ క్రమంలోనే కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడి విభాగంలో నామినేట్ అయ్యాడు. కాగా, ఈ షార్ట్ ఫిలిమ్ లాస్ ఏంజెల్స్ ఫిలిమ్ ఫెస్టివల్ 2023 లో అవార్డు గెల్చుకుంది.
ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీ, నటులు మాత్రమే బెస్ట్ యాక్టర్ విభాగంలో పోటీపడుతుంటారు. ఈసారి నటుడు షఫీకి అరుదైన గౌరవం దక్కడం ప్రేక్షకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి అందరికీ తెలిసిందే.. ఈ వేడుకలు ఎంతో కలర్ ఫుల్ గా దిగ్గజ నటీ,నటులు, దర్శక, నిర్మాతలు ఇతర టెక్నీషియన్స్ తో సందడిగా ఉంటుంది. ప్రతిభావంతులైన నటులకు అవార్డులు ప్రధానం చేస్తుంటారు. ఈ సందర్భంగా నటుడు షఫీ మాట్లాడుతూ…‘ ప్రతిభావంతులైన నటులను గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.. డైరెక్టర్ అమిత్ తో ఈ మూవీ చేసేటపుడు ఎంతో నేర్చుకున్నానను.. ‘3.15 AM’ షార్ట్ ఫిలిమ్ అయినప్పటికీ పెద్ద ప్రాజెక్ట్ గా భావించి కష్టపడ్డాం. ఆ కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది.. మా గౌరవం నాకు దక్కడం చాలా సంతోషం’ అని అన్నారు.