గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. కొంత మంది అనారోగ్యంతో చనిపోతే.. కొందరు ఆత్మహత్య చేసుకొని విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.
మాలీవుడ్ కి చెందిన యువ నటుడు శరత్ చంద్రన్ శుక్రవారం మృతి చెందినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అతని నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అతని వయసు 37 సంవత్సరాలు. ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. శరత్ చంద్రన్. శరత్ కు తండ్రి చందన్, తల్లి లీలతోపాటు సోదరుడు ఉన్నారు.
కొచ్చికి చందిన శరత్ చంద్రన్ గతంలో ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. మొదటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్న శరత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అతను.. అనిస్య సినిమాతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు. లిజో జోస్ పెల్లిస్సేరి యాక్షన్ డ్రామా సినిమా అంగమలీ డైరీస్ లో శరత్ కీలక పాత్రలో నటించాడు. మాలీవుడ్ నటుడు ఆంటోనీ వర్గీస్ పెపే శరత్ మరణం పట్ల సంతాపం తెలియచేశాడు. శరత్ మృతితో అభిమానులు షాకయ్యారు. సోషల్ మీడియా వేదికగా నటుడికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయసుధ