ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న భార్య భర్తల లిస్ట్ కోసం గూగుల్ సర్చ్ చేస్తే.. దానిలో నటుడు సంపత్ రాజ్ పేరు తప్పనిసరిగా కనిపిస్తుంది. మిర్చి సినిమాతో ఎంతో పాపులర్ అయిన ఈ నటుడు, ప్రముఖ నటి శరణ్య భార్య భర్తలని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని గతంలో బోలేడు వార్తలు వచ్చాయి. వీటిపై టీవీ షోలో క్లారిటీ ఇచ్చాడు సంపత్ రాజ్. తామిద్దరం మంచి స్నేహితులమని.. ఎవరో తమ గురించి తప్పుడు వార్తలు రాశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
తాజాగా నటుడు సంపత్ రాజ్.. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యతగా ప్రసారం అవుతోన్న ఆలీతో సరదగా కార్యక్రమానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో సంపత్ రాజ్ సినిమాలతో పాటు ఆయన వ్యక్తిగత అంశాల గురించి కూడా వెల్లడించాడు. ఈ క్రమంలోనే నటి శరణ్య తన మాజీ భార్య అనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. శరణ్య, ఆమె భర్త, వారి పిల్లలు అంతా తనకు మంచి స్నేహితులని.. తమంతా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలపాడు.
అయితే గతంలో ఓ సినిమాలో శరణ్య, తాను భార్యభర్తలుగా నటించామని.. ఆ తర్వాత కొన్ని సైట్లు.. ఆమె తన భార్య అని.. కొన్నాళ్ల తర్వాత తామిద్దరు విడిపోయామంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు. ఇక తన తల్లికి సినిమాలంటే ఇష్టం లేదని.. కానీ తండ్రి తనను ప్రోత్సాహించారని.. అందుకే ఇంటి నుంచి పారిపోమ్మని సలహా ఇచ్చారని తెలిపాడు. తన తల్లిదండ్రులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు సంపత్ రాజ్. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చూడండి.