ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్నిరోజుల క్రితమే సినీ నటి మీనా భర్త విధ్యాసాగర్ అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ(93) మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఆర్.నారాయణ మూర్తి వాళ్లది తూర్పు గోదావరి జిల్లా, రైతులపూడి మండలం మల్లంపేట గ్రామం. తల్లి రెడ్డి చిట్టెమ్మ, తండ్రి రెడ్డి చిన్నయ్య నాయడు. వాళ్లది చాలా సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. నారాయణ మూర్తి ఈ స్థాయికి చేరడానికి వాళ్ల అమ్మే స్ఫూర్తి అంటా. చదువు విషయంలో చాలా బాధ పడుతున్న నారాయణ మూర్తి కి వాళ్ల అమ్మ చెప్పిన ఓ మాట తనలో స్ఫూర్తిని నింపిందట. ” మనం ఏటా పొలంలో పంట వేస్తాం. ఒక ఏడాది పండితే.. మరో ఏడాది ఎండుతుంది. అలాగని పంట వేయడం మానుతామా? పొలం చెడ్డదని తప్పుపడతామా? అని, పరీక్షలు కూడా అంతే..” అని రెడ్డి చిట్టెమ్మ నారాయణ మూర్తిలో స్ఫూర్తి నింపిందంట. కొడుకు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న డబ్బులు పంపిచమని కానీ, వారి సొంత అవసరాలకు కానీ ఏ కొరిక కోరలేందట. కానీ ఆమె కొరింది తమ సొంత గ్రామంలో రాముడి గుడి మాత్రమే. ఊర్లో పెళ్లి, వేడుకులు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఆమె ఉద్దేశం. ఈ విషయాలు ఆర్.నారాయణ మూర్తి తన అమ్మ గురించి ఓ ఇంటర్య్వూలో తెలిపారు.