ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్నిరోజుల క్రితమే సినీ నటి మీనా భర్త విధ్యాసాగర్ అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ(93) మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆర్.నారాయణ మూర్తి వాళ్లది తూర్పు గోదావరి జిల్లా, రైతులపూడి మండలం మల్లంపేట గ్రామం. తల్లి రెడ్డి చిట్టెమ్మ, […]