సినిమా వాళ్ల గురించి ఏ చిన్న వార్త బయటకొచ్చినా సరే ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. అలాంటిది ఇక వాళ్ల పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాలైతే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ప్రముఖ నటుడు మూడోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. భార్య సీమంతం వీడియో షేర్ చేసి మరీ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్, సహ నటీనటులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఒకామెని పెళ్లి చేసుకున్న అతడికి ఓ పాప ఉంది. రెండో పెళ్లి చేసుకోగా ఆమెకి ఓ పాప ఉంది. ఇప్పుడు మళ్లీ ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ తివారి, 51 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా భార్య సురభి తివారి సీమంతం ఫంక్షన్ కు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ‘కొన్ని హ్యాపీ మూమెంట్స్, క్షణాల్ని మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలానే నిలిచిపోతుందని భావిస్తున్నాను’ అని సదరు వీడియోకి క్యాప్షన్ జోడించారు. మనోజ్ ఫ్యాన్స్ అయితే శుభాకాంక్షలు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా మనోజ్ తివారి 1999లో రాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రితి అనే పాప పుట్టింది. 2012లో వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత మనోజ్ సురభిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2020లో పాప పుట్టింది. తాజాగా మరోసారి తండ్రి అయినట్లు వెల్లడించాడు. ఇకపోతే బిగ్ బాస్ హిందీ నాలుగో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన మనోజ్ తివారి.. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అంతకు ముందు 2003-14 మధ్య కాలంలో ఓ 20కి పైగా సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ తో పాటు భారత్ కి షాన్, షుర్ సంగ్రామ్, వెల్కమ్, నెహ్లే పే దెహ్ల షోల్లోనూ హోస్ట్, కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.