సాధారణంగా సినిమాలు.. హీరోలు.. వారు చేసే కామెంట్స్ విషయంలో ఎప్పుడూ గొడవలు పడేది అభిమానులే. మనం ఎక్కువగా మా హీరోని తిట్టాడని.. మా హీరో సినిమాని తిట్టాడని ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. సినిమాలైనా, హీరోలైనా గొడవపడేది.. కొట్టుకునేది ఫ్యాన్సే. కానీ.. ఇటీవల ఏకంగా ఓ స్టార్ హీరోపైనే చెప్పు విసరడం అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. కన్నడ స్టార్ దర్శన్. ఆయన ప్రస్తుతం ‘క్రాంతి’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా జనవరి 26న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. అయితే.. సినిమా రిలీజ్ కి సమయం దగ్గరపడుతుండటంతో సాంగ్స్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో ఆదివారం క్రాంతి మూవీలో రెండో సాంగ్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం హోస్ పేటలో ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ లో దర్శన్ ఫ్యాన్స్ కి, పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ కి మధ్య వాగ్వాదం జరగడంతో.. అక్కడే స్టేజ్ వైపు వెళ్తున్న హీరో దర్శన్ పైకి ఓ అభిమాని చెప్పు విసిరాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే ఆ చెప్పు విసిరిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ అని జోరుగా వార్తలు ప్రచారం జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే శివరాజ్ కుమార్, సుదీప్, రమ్య లాంటి చాలామంది కన్నడ స్టార్స్ స్పందించి దర్శన్ కి సపోర్ట్ గా నిలిచారు. అయితే.. తాజాగా హీరో దర్శన్ తనపై దాడి జరిగిన సంఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇలాంటి ఘటనలు ఎప్పటికీ తనను బలహీన పరచలేవని చెప్పడం విశేషం.
ఇంతకీ దర్శన్ ట్వీట్ లో ఏం రాసుకొచ్చాడంటే.. “ప్రస్తుతం నాకంటే నా తోటి నటీనటులే ఎక్కువగా బాధపడుతున్నారు. ఇలాంటి దాడి ఘటనలు మనిషిని బలహీన పరచలేవు. మరింత బలంగా మారుస్తాయి. మన సొంత కన్నడ గడ్డపైనే ఇలాంటి షాకింగ్ ఘటనలు ఎన్నో చూశాం. ఇలాంటి తరుణంలో న్యాయం కోసం నిలబడిన ఫ్రెండ్స్, సహనటులకు ధన్యవాదాలు. మా సినిమా ఈవెంట్ ని పాడు చేయడానికి వచ్చినవారికీ ధన్యవాదాలు. నేను ముందునుండే నమ్ముతున్న మాట నిజమైంది. ఒక ఈవెంట్ ని వందలమంది పాడుచేయాలని చూస్తే.. వేలమంది సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలిచారు. నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని చెప్పాడు. ప్రస్తుతం దర్శన్ ట్వీట్ వైరల్ గా మారింది. మరి హీరో దర్శన్ పై జరిగిన దాడి ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by Darshan Thoogudeepa Shrinivas (@darshanthoogudeepashrinivas)
#WATCH : Slipper Hurled At Kannada Actor Darshan During ‘kranti’ Promotion
.
A slipper was hurled at Kannada actor Darshan Thoogudeepa on Sunday over a sexist remark he made recently.
.
.#darshan #news #kranti #newsreelsindia pic.twitter.com/uVNaJo1JTn— Newsreels India (@newsreelsindia) December 20, 2022