ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపై ఎయిర్ పోర్టులో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అతనిపై దాడి చేసిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే బెంగుళూరు ఎయిర్ పోర్టులో జరిగిన ఈ దాడిపై అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. పునీత్ రాజ్ కుమార్ మరణించటంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయ్ సేతుపతి వెళ్లలేదని ఈ కారణంతోనే పునీత్ అభిమానులే దాడి చేశారంటూ వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా మాత్రం ఈ దాడిపై మరిన్ని వాస్తవ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆయనపై దాడి చేయటానికి ఈ కారణం కాదని మరో కారణమంటూ తెలుస్తోంది. ఇక పూర్తి విషయానికొస్తే విజయ్ పై దాడి చేసిన వ్యక్తి పేరు జాన్సన్. అతడు కేరళ రాష్ట్రానికి చెందినవాడని, ఉద్యోగ నిమిత్తం బెంగుళూరులో ఉంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవల హీరో విజయ్ సేతుపతిని బెంగుళూరు ఎయిర్ పోర్టులో చూసి ఓ సెల్ఫీ అడిగానని, అందుకు ఆయన నిరాకరించాడని తెలుస్తోంది. ఇక ఈ కారణంతోనే కోపంతో ఊగిపోయిన జాన్సన్ అలా విజయ్ పై ఎగిరి తన్నినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత అతడు విజయ్ కి క్షమాపణలు కూడా చెప్పాడట.
