ఒకప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా.. కోటి రూపాయల పారితోషికం అందుకున్న రికార్డు ఇలియానా సొంతం. అంతటి క్రేజ్ సంపాదించుక్ను ఇలియానా.. ఉన్నట్లుండి సౌత్‌కు దూరమయ్యింది. బాలీవుడ్‌పై మోజుతో దూరమయ్యింది అనుకున్నాం కానీ.. ఓ నిర్మాత వల్ల ఇలియానా సౌత్‌కు దూరం అయ్యింది.. ఏం జరిగింది అంటే..
సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలుపుకోవడం కూడా అంతే కష్టం. చాలా మంది నటీనటుల విషయంలో ఇది నిజమని నిరూపితం అయ్యింది. ఇండస్ట్రీలో స్టార్‌లుగా ఎదిగిన వాళ్లు కూడా ఆ తర్వాత.. అవకాశాలు లేక.. ఫేడ్‌అవుట్ అవుతారు. ఏళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉంటారు. అందుకు తెర మీద, తెర వెనుక జరిగే ఎన్నో సంఘటనలు కారణం అవుతాయి. అయితే అన్ని బయటపడవు. తాజాగా ఓ నటికి ఎదురైన ఇలాంటి సంచలన విషయం ఒకటి ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఆ నటి ఎవరంటే ఇలియానా. ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే బాలీవుడ్ మీద మోజుతోనే ఇలియానా సౌత్‌కు దూరమయ్యింది అని అందరూ భావించారు. కానీ అసలు వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది ఇలియానా. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన నటించిన పోకిరి సినిమాతో ఈ గోవా బ్యూటీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. టాప్ హీరోలందరి చిత్రాల్లో నటించింది. సౌత్‌లో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. బాలీవుడ్‌లో ఇలియానా చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ సాధించాయి. కానీ ఈ అమ్ముడు అనుకున్న మేర బాలీవుడ్‌లో రాణించలేదు. ఇటు సౌత్‌లో కూడా కనిపించలేదు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేవుడు చేసిన మనుషులు.. తెలుగులో ఇలియానా నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత ఇలియానా సౌత్‌లో కనిపించలేదు. తాజాగా 2018లో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్యలో బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు వస్తుండటంతోనే ఇలియానా సౌత్ సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపించింది. కానీ అది వాస్తవం కాదు. ఇలియానా కావాలని సౌత్ సినిమాలకు దూరం కాలేదు. ఆమెను బ్యాన్ చేయడం వల్లే సౌత్ సినిమాలకు దూరం అయ్యింది. పదేళ్ల తర్వాత ఈ నిజం వెలుగులోకి వచ్చింది. అసలు ఇలియానా మీద బ్యాన్ విధించడం ఏంటి.. ఎందుకు అంటే..
దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలోనే ఇలియానా.. ఓ కోలీవుడ్ సినిమాకు సైన్ చేసింది. విక్రమ్ హీరోగా కోలీవుడ్ నిర్మాత నటరాజ్ నందం అనే సినిమాను ప్లాన్ చేశాడు. ఈ మూవీలో ఇలియానాను హీరోయిన్‌గా అనుకున్నారు. 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దాంతో నిర్మాత నటరాజ్.. అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిందిగా ఇలియానాను కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. కావాలంటే మరో సినిమాలో యాక్ట్ చేస్తాను తప్ప.. డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
దాంతో నిర్మాత నటరాజ్.. నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఇలియానాపై ఫిర్యాదు చేశాడు. వారు చెప్పినా సరే.. ఇలియానా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. ఆమెపై నిషేదం విధించారు. డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఆమెను సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించారు. అందువల్లే ఇలియానా సౌత్ సినిమాలకు దూరం అయ్యింది అని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇటీవలే ఇలియానా ఆ సమస్యను పరిష్కరించుకున్నారని.. త్వరలోనే ఆమె సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి గోవా బ్యూటీ రీఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. ఇలియానాపై నిషేధం విధించడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.