ప్రముఖ నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో గత నాలుగు వారాలుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స చేసినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. కరోనాతో పోరాడుతూ ఆదివారం (ఫిబ్రవరి 6) తుది శ్వాస విడిచారు. పలు భారతీయ భాషల్లో ఆమె వేల పాటలు పాడారు. లతాజీ పాడిన ప్రతి పాట ఆణిముత్యమే. ఆమె పాటల్లో ప్రేక్షకుల మదిలో నిలిచే టాప్ 10 పాటల వివరాలు..
1. గైడ్ సినిమాలోని పియా తోసే
లతా మంగేష్కర్ 1965లో పియా తోసే అనే రొమాంటిక్ పాటను పాడారు. వహీదా రెహ్మాన్, దేవ్ ఆనంద్‌లు ఈ చిత్రంలో నటించారు. 2022లో కూడా ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. నిజానికి, పియా తోసే బాలీవుడ్‌లోని మోస్ట్ రోమాంటిక్ సాంగ్స్ లో ఒకటి.
2. ఆరాధన నుండి కోరా కాగజ్ థా యే మన్ మేరా
లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన కోరా కాగజ్ ఆల్-టైమ్ హిట్.
3. వో కౌన్ థి నుండి లాగ్ జా గలే
లతా మంగేష్కర్ గాత్రం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఈ పాట. చాలా మంది గాయకులు ఈ క్లాసిక్ కవర్‌లను ప్రయత్నించారు కానీ లత చేసిన విధంగా పాట ఆత్మను సంగ్రహించడంలో విఫలమయ్యారు.
4. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే నుండి తుజే దేఖా యో యే జానా సనాం
కుమార్ సాను, లతా మంగేష్కర్ పాడిన ఈ పాట ఇప్పటికి చాలా మందికి ఆల్ టైమ్ ఫెవరెట్ సాంగ్. డీడీఎల్‌జే విడుదలైన సమయంలో ఈ పాట దేశాన్ని ఓ ఊపు ఊపింది.
5. అన్ఫధ్ సినిమాలోని ఆప్ కి నజ్రోన్ నే సంఝా
మాలా సిన్హా, ధర్మేంద్ర, బాల్‌రాజ్ సహన్ నటించిన ఈ పాటను లతా మంగేష్కర్ 1962లో విడుదలైన అన్పధ్ చిత్రం కోసం పాడారు.
6. ఏ మేరే వతన్ కే లోగోన్
ఈ దేశభక్తి గీతం ఏ సినిమా పాట చేయలేని విధంగా దేశాన్ని కదిలించింది. గాయని లతా మంగేష్కర్ పాడిన ఈ పాట 1962లో జరిగిన చైనా-ఇండియా యుద్ధంలో మరణించిన భారతీయ సైనికులను స్మరించుకుంటుంది. ఈ పాటను యుద్ధం జరిగిన రెండు నెలల తర్వాత 1963 రిపబ్లిక్ డే రోజున లతా మంగేష్కర్ మొదటిసారి పాడారు. ఈ పాట విని నెహ్రూ కూడా కంటతడి పెట్టారు.
7. దిల్ సే నుండి జియా జలే
మణిరత్నం 1998 చిత్రం దిల్ సే చిత్రంలో ప్రీతి జింటా షారూఖ్ ఖాన్‌లు నటించారు. దీనిలో లతా మంగేష్కర్ పాడిన జియా జలే ఆమె పాడిన పాటల్లో ది బెస్ట్ గా నిలిచింది.
8. సత్యం శివం సుందరం
శశి కపూర్, జీనత్ అమన్ నటించిన సత్యం శివం సుందరం పేరుతో 1978 లో తీసిన ఈ సినిమాలో అదే పేరుతో ఉన్న పాట పాడారు లతా మంగేష్కర్. నివేదికల ప్రకారం, దర్శకుడు రాజ్ కపూర్ ఆ పాత్రలో లతను నటించాలని కోరుకున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఆ తర్వాత జీనత్ ఆ పాత్ర పోషించింది.
9. కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో టైటిల్ ట్రాక్
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్‌లతో సహా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన మరి కొంతమంది పెద్ద స్టార్లు నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్‌ని లతా జీ పాడారు
10. పాకీజా నుండి చల్తే చల్తే
ఈ పాటతో లతా మంగేష్కర్ మరోసారి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్నారు.