ఫిల్మ్ డెస్క్- కరోనా ప్రభావం వెంకటేష్ నారప్పపై పడింది. హీరో వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన నారప్ప సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్స్ ను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం.. మే 13న రిలీజ్ కావాల్సిన ఆచార్య సినిమాల రిలీజ్ డేట్ను పోస్ట్పోన్ చేశారు. ఇదే సమయంలో మే 14న విడుదల కావాల్సిన నారప్ప సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నిర్మాతలు అధికారకంగా ప్రకటించారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ అధికారకంగా థియేటర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించిననున్నట్టు చెప్పారు. తమిళ సూపర్ హిట్ అసురన్ సినిమాకి రిమేక్ గా వస్తున్న నారప్ప సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా, వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు.