స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకం గానే ఈ రైలుకు ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేశారు. 2013లో ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది. మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల మీదుగా సాగిపోతుంది. మధ్యలో 56 స్టేషన్‌లలో ఆగుతుంది.
దిబ్రూగఢ్‌లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి ఐదు రోజులు పడుతుంది. ఇది వీక్లీ ట్రైన్. టూర్‌కి వెళ్తున్న ప్రదేశం ప్రత్యేకతలను ముందుగా తెలుసుకుని బయలుదేరితే ఆసాంతం ఆస్వాదించవచ్చు. నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఏపీలోని పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్ మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది.
టూర్ లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రం పూర్తిస్థాయిలో తీసుకోవాలి. ఇక రోజంతా ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. టూర్‌కి వెళ్లే ముందు ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించి, డాక్టర్ సూచించిన మందులను వెంట తీసుకు వెళ్లాలి.
మన రైల్వేలో కొన్ని విశేషాలు:
భారతదేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణిచే రైలు మహారాష్ట్రలోని నాగపూర్ నుండి అజ్ని వరకు ప్రయాణం చేస్తుంది. ఈ రైలు ప్రయాణం చేసే దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే. భారతదేశంలో అత్యంత చిన్న పేరున్న రైల్వే స్టేషను ఇబ్. ఇది ఒడిషా లోని ‘ఝూర్స్ గూడా; సమీపంలో ఉంది.