ఆర్థికంగా వెనుకబడి చదువు కొనసాగించలేకపోతున్నారా! అయితే మీకో శుభవార్త. ‘U-Go స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ద్వారా గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కింద, టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులు 40వేల నుంచి 60 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. U-Go అనేది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థ. GiveIndiaతో కలిసి ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశంలోని అమ్మాయిలందరూ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఎలా చేయాలి? దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజినీరింగ్.. వంటి ప్రొఫెషనల్ డిగ్రీ చదివే అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెగ్యులర్ డిగ్రీ కోర్సులో నమోదు చేసుకుని ఉండాలి. అలాగే పదోతరగతి, ఇంటర్‌లో 70 శాతం మార్కులు వచ్చి ఉండాలి. కుటంబ వార్షిక ఆదాయం 5 లక్షలకు మించకూడదు.
గమనిక: ఈ స్కాలర్‌షిప్ నిధులను అకడమిక్ ఖర్చు ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. అనగా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, ఆహారం, ప్రయాణం, పుస్తకాలు, ఆన్‌లైన్ లెర్నింగ్ వంటి విద్యాపరమైన ఖర్చు ప్రయోజనాల కోసం మాత్రమే.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక ప్రక్రియ: విద్యార్థుల అకడమిక్ మెరిట్, కుటుంబ ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఎంపికచేస్తారు. అలా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను తుది ఎంపిక కోసం టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30 నవంబర్ 2022.