మీరు ఇంటర్ పూర్తి చేశారా? అయితే మీ కోసమే ఈ లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయం. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఆర్థిక సహాయాన్ని ఎలా పొందాలంటే?
పైలెట్ అవ్వాలన్నది మీ కలా..! విమానమెక్కి గగన వీధుల్లో విహరించాలనుకుంటున్నారా.. అయితే, మీకో శుభవార్త. పైలెట్ అవ్వాలనుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. దీంతో మీ కలను సాకారం చేసుకోవచ్చు. పైలెట్ అవ్వాలన్న కోరిక అందరకీ ఉండొచ్చు.. కానీ అది అంత తేలికైన విషయం కాదు. అందునా మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేద దళిత యువతకు అది అందని ద్రాక్షే. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం […]
ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది. అందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5100 స్కాలర్‌షిప్‌ల అందించబోతున్నారు. ఇందులో 5000 స్కాలర్‌షిప్స్ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కాగా, 100 స్కాలర్‌షిప్స్ పీజీ విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఈ స్కాలర్‌షిప్స్ పొందడానికి అర్హతలేంటి..? ఎలా అప్లై చేయాలి..? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.. […]
ప్రతిభ ఉన్న వారి అవసరం దేశానికి చాలా ఉంది. ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన కారణంగా చదువు అర్ధాంతరంగా ఆగిపోకూడదనే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా పేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్పులను అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బడ్తే కదం స్కాలర్ షిప్ 2022-23 ప్రోగ్రాం పేరుతో.. ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తున్నవారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి […]
ఆర్థికంగా వెనుకబడి చదువు కొనసాగించలేకపోతున్నారా! అయితే మీకో శుభవార్త. ‘U-Go స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ద్వారా గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కింద, టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులు 40వేల నుంచి 60 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. U-Go అనేది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థ. GiveIndiaతో కలిసి ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశంలోని అమ్మాయిలందరూ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు […]
పేద, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించాలంటే మూడు పుటల్లో ఒక పూట పస్తులుండాలి. రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి ఉంది నేడు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలంటే కార్పొరేట్ స్కూళ్లలో, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించాలి. కానీ నాలుగు మెతుకులు సంపాదించుకోవడానికే ఈ బతుకులు సరిపోవడం లేదు. అలాంటిది ఇక పిల్లల చదువులు, పుస్తకాలు, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడానా? అనేలా ఉంది. ఇలా పిల్లల […]
రాకెట్ యుగంలో ఉన్నా.. నేటికి కూడా మన సమాజంలో ఆడా మగా తేడాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. నేటికి కూడా ఆడపిల్లను చిన్న చూపు చూసేవారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో బాలికల విద్య కోసం.. ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా బాలికల విద్య కోసం ఎన్నో స్కాలర్‌షిప్‌లు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థినిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థినిలకు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు ఎన్టీఆర్ […]
ప్రస్తుతం దేశంలో ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకోవాలంటే.. ఎలాంటి కాంపిటీషన్ ఎదుర్కొవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పేద విద్యార్థులు కోసం ఈ మద్య కొన్ని కంపెనీలు స్కాలర్ షిప్ అందిస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసొందే. మంచి ప్రతిభ కలిగి ఉండి.. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆశయం ఉన్నప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనివారి కోసం పానసోనిక్ ఒక […]
దేశంలో ఇప్పుడు మంచి ఉద్యోగావకాశాలు పొందాలంటే చదువు ఎంతో ముఖ్యం. ఎంతో గొప్ప విజ్ఞానం, ప్రతిభ ఉన్నప్పటికీ చదువుకునేందుకు సరైన వసతులు లేక అవకాశాలు రాక పేద విద్యార్థులు చదువు మద్యలోనే ఆపేస్తుంటారు. మంచి ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదవలేకపోతున్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఎల్ ఐసీ స్కాలర్ షిప్ ద్వారా అందిస్తుంది. ఎల్ఐసీ తన అనుబంధ విభాగం అయిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘విద్యాధన్’స్కారల్ షిప్ పేరుతో అర్హత ఉన్న విద్యార్థులకు […]
కొంతమందికి ప్రతిభ ఉంటే డబ్బుండదు, కొంతమందికి డబ్బుంటే ప్రతిభ ఉండదు. డబ్బు ఉండి ప్రతిభ లేకపోయినా ఏదో రకంగా బతికేయచ్చు. కానీ ప్రతిభ ఉండి డబ్బు లేకపోతే మాత్రం అది వారి జీవితాలే కాదు సమాజం కూడా వెనకబడిపోవడానికి కారణమవుతుంది. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా చదువులో ప్రతిభ చూపించేవారికి ఆర్ధిక ప్రోత్సాహం ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ప్రతిభ ఉండి ఆర్ధికంగా వెనకబడి ఉన్న వారి కోసం స్కాలర్ షిప్ లు అందిస్తున్నాయి. ఆర్థిక వైకల్యం […]