డిగ్రీ, డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డాయి. నెలకు రూ. 25 వేల నుంచి రూ. 81 వేల జీతం ఇస్తారు. పూర్తి వివరాలు మీ కోసం..
డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేశారా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీ కోసమే. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటిలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 797 జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ జూన్ 3 నుంచి ప్రారంభం కానుంది. డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఆసక్తి ఉంటే జూనియర్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పరిమితి ఎంత? జీతం ఎంత? దరఖాస్తు రుసుము ఎంత? వంటి వివరాలు మీ కోసం.