మంచి ఉద్యోగం సాధించి.. జీవితంలో బాగా స్థిరపడాలని యువత కోరుకుంటుంది. కొందరు ప్రముఖ సంస్థలో మంచి జీతంతో కూడిన జాబ్ ను పొందుతుంటారు. అయితే మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. అలా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి పోస్టల్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ పోస్టల్ సర్వీస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక మరొక విషయం ఏమింటటే ఈ పోస్టులకు రాత పరీక్ష అనేది లేదు. ఇంటర్, టెన్త్ పాసై ఉంటే చాలు.. ఈ ఉద్యోగాని కి అప్లయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు పక్రియ కొనసాగుతుంది. నవంబర్ 22న ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది. మరి.. ఈ పోస్టాఫీసు ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుుకుందాం..
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇండియన్ పోస్టాఫీస్ శుభవార్త చెప్పింది. ఆశాఖలోని పలు విభాగాల్లోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇక ఈ పోస్టుల విభాగాల వివరాల విషయనికి వస్తే… పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ వాటిలో ఉద్యోగాలున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ పోస్టుల్ని క్రీడ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్ పాస్ కావడంతో పాటు ఆయా క్రీడల్లో రాణించిన క్రీడాకారులు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఖాళీల వివరాలకు విషయానికి వస్తే.. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అస్టిసెంట్ -71, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్-56, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-61 ఉన్నాయి.
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డు ఉద్యోగాలకు ఇంటర్ లేదా అదే స్థాయిలో సమానమైన మరో ఇతర కోర్సులు ఉతీర్ణులై ఉండాలి. అంతేకాక బేసిక్ కంప్యూటర్ శిక్షణకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి.
సంబంధిత విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఆసక్తి గల అభ్యర్ధులు పూర్తి సమాచారం కొరకు https://dopsportsrecruitment.in/ అనే వెబ్ సైట్ లో చూడండి.