కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ద్వారా మొత్తం 1671 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ (1,521), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) (150) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 1671
అర్హతలు: మెట్రిక్యులేషన్/ పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయోపరిమితి: 25.11.22 నాటికి ఎస్‌ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు, ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ. 56,900 వరకు చెల్లిస్తారు.
పరీక్షా విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షా ఫలితాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50 కాగా, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: నవంబర్ 05, 2022
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 25, 2022