కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద పని చేసే తొమ్మిది యూనిట్లలో ఒకటైన బ్యాంక్ నోట్ ప్రెస్ సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు నోట్ల డిజైనింగ్, బ్యాంకు నోట్లు మరియు సెక్యూరిటీ ఇంకులు మొదలైనవి తయారు చేసే ఈ ఎస్పీఎంపిసిఐఎల్ కంపెనీ ఢిల్లీలో ఉంది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రణలో పని చేసే ఈ సంస్థ యొక్క కార్యచరణలో భాగమైన నాణాలు ముద్రించే 4 ఆపరేషనల్ యూనిట్స్ ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడాలో ఉండగా.. నాసిక్, దేవాస్, హైదరాబాద్, హోషంగాబాద్ లలో నాలుగు కరెన్సీ/సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. వీటిలో హోషంగాబాద్ లో ఉన్న మిల్లులో అధిక నాణ్యత గల కరెన్సీ పేపర్ తయారవుతుంది. కాగా ఈ సంస్థలో ప్రతిభావంతులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా ఈ జాబ్ కి అప్లై చేయవచ్చునని నోటిఫికేషన్ లో పేర్కొంది. మరి ఈ జాబ్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? జీతం ఎంత? వయసు పరిమితి ఎంత? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
పైన తెలుపబడిన పరీక్ష కేంద్రాల్లో ఆన్ లైన్ పరీక్ష జరుగు తేదీ: జనవరి/ఫిబ్రవరి 2023