చెన్నై కప్ కొట్టింది. ఇది జరిగిన కాసేపటికే ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. వీళ్ల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?
చెన్నై సూపర్ కింగ్స్ కప్ కొట్టింది. ఫైనల్లో గుజరాత్ ని ఓడించి మరీ ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. కెప్టెన్ ధోనీని ప్రతిఒక్కరూ ఆకాశానికెత్తేస్తున్నారు. తోపు తురుము అని తెగ పొగిడేస్తున్నారు. ఇలా అంతా హడావుడిగా ఉండగానే.. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అందరికీ షాకిచ్చాడు. కాబోయే భార్యని పరిచయం చేశాడు. పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం చెన్నై ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇంతకీ రుతురాత్ మ్యారేజ్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు? ఈ వేడుక ఎప్పుడు జరగబోతుంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సూపర్ కింగ్స్ కి దొరికిన అద్భుతమైన ఓపెనర్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యాటర్.. 2020లో ఫస్ట్ టైమ్ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్ లో సీఎస్కే తరఫున కేవలం 6 మ్యాచులే ఆడినప్పటికీ 204 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సీజన్ లో అన్నీ మ్యాచ్ లు ఆడి 635 రన్స్ కొట్టాడు. చెన్నై కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది 368 రన్స్ కొట్టి నామమాత్రంగా బాగానే ఆడాడు. ఈసారి 590 పరుగులు చేసి చెన్నై మ్యాచులు గెలవడం, ఫైనల్లో కప్ కొట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. చెన్నై జట్టుకు దొరికిన ఫ్యూచర్ స్టార్ ఇతడు.
26 ఏళ్ల రుతురాజ్.. మరికొన్నిరోజుల్లో జరగాల్సిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం లండన్ వెళ్లాల్సింది. కానీ అతడి బదులు యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ వెళ్లాడు. దీనికి రీజన్ ఏంటా అని అందరూ అనుకున్నారు. కానీ రుతురాజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ కారణంగానే WTC ఫైనల్ కి డుమ్మా కొట్టేశాడు. అలానే ఐపీఎల్ ఫైనల్లో చెన్నై కప్ కొట్టిన తర్వాత తన కాబోయే భార్యని పరిచయం చేశాడు. ఆమె పేరు ఉత్కర్ష. ధోనీతో కలిసి ఉత్కర్షతో తీసుకున్న ఫొటోని రుతురాజ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. వీళ్లిద్దరి పెళ్లి జూన్ 3-4 తేదీల్లో జరగనుందని తెలుస్తోంది. ఆమె గురించి ప్రస్తుతానికి వివరాలేం బయటకు రాలేదు. వస్తే కచ్చితంగా చెబుతాం. మరి రుతురాజ్ కప్ కొట్టి, కాబోయే భార్యని పరిచయం చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.