విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. కోహ్లీ ఆ విషయాన్ని మర్చిపోయినా.. నవీన్ ఉల్ హక్ ఇప్పుడప్పుడే దానిని వదిలేలా లేడు. తాజాగా ఆర్సీబీ- ముంబయి మ్యాచ్ జరుగుతుంటే ఒక ఒక మాకింగ్ పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వివాదం ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలుసు. మచ్యా తర్వాత కూడా వారి మధ్య మాటల పరోక్షంగా మాటల యుద్ధం, సోషల్ మీడియాలో వార్ నడిచిన విషయం తెలిసిందే. మంగళవారం ఆర్సీబీ- ముంబయి మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట్లో ఆర్సీబీ కాస్త తడబడింది. విరాట్ కోహ్లీ 4 బంతుల్లో కేవలం ఒకే పరుగు చేసి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన అనుజ్ రావత్ కూడా 4 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో నవీన్ ఉల్ హక్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు.
నవీన్ ఉల్ హక్ ఒక ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు. అందులో ఒక టేబుల్ మీద మామిడికాయలు ఉన్నాయి. ఎదురుగా టీవీలో ముంబయి- ఆర్సీబీ మ్యాచ్ నడుస్తోంది. స్వీట్ మ్యాంగోస్ సూపర్ ఉన్నాయి అంటూ ఏమోజీలు కూడా పెట్టాడు. అది పరోక్షంగా ఆర్సీబీకి కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా నవీన్ ఉల్ హక్ కోహ్లీతో వివాదానికి ఇప్పుడప్పుడే తెరదించేలా లేడంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెటర్లు అయి ఉండి ఇలా చిన్నపిల్లల్లా ఇన్ డైరెక్ట్ కామెంట్లు, క్రిప్టెడ్ పోస్టులు పెట్టుకుని కామెంట్ చేసుకోవడం మరీ సిల్లీగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు.
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండు వికెట్లు పడిన తర్వాత ఆర్సీబీ జట్టు చెలరేగింది. ఫాఫ్ డుప్లెసిస్, గ్లెక్ మ్యాక్స్ వెల్ ఇద్దరూ విజృంభించారు. మ్యాక్స్ వెల్ 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. బెహ్రెన్ డార్ఫ్ బంతికి బౌండ్రీ మీద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన లామ్ రోర్ కూడా 3 బంతుల్లో ఒకటే పరుగు చేసి.. వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. డూప్లెసిస్ క్రీజులో నిలదొక్కుకుని దినేశ్ కార్తీక్ తో కలిసి ఆటను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి.. 146 పరుగులు చేసింది. నవీన్ ఉల్ హక్ పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hey @WWE Can you arrange triple threat hell in a cell match between Virat Kohli, Naveen Ul Haq and Gautam Gambhir on behalf of @IPL .!😂❤
My results prediction for that – #KingKohli one sided pelega😂#naveenulhaq #GautamGambhir #ViratGambhirFight #ViratKohli #RCBvsMI #RCBvMI pic.twitter.com/EgdEBSbNIr
— VK18Forever (Fan Page) (@VKianForever) May 9, 2023