ఆర్సీబీపై గెలిచి జోష్‌లో ఉన్న కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ టోర్నీకి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా కేకేఆర్ వెల్లడించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టాప్ టీమ్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. స్టార్ ప్లేయర్లతో నిండిన ఈ జట్టుకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటిలాగే ఈసారి కూడా భారీ అంచనాలతో ఐపీఎల్‌ను ఆరంభించింది కేకేఆర్. కానీ ఆ జట్టు ప్రయాణం మాత్రం అంత సాఫీగా సాగడం లేదు. ఈ సీజన్లో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో కోల్‌కతా కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. మిగతా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలైంది. నాలుగు వరుస పరాజయాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విక్టరీతో చెక్ పెట్టింది. ఏప్రిల్ 29వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. అయితే సక్సెస్ జోష్‌లో ఉన్న కోల్‌కతాకు ఒక బ్యాడ్ న్యూస్.
కేకేఆర్ ఓపెనర్, స్టార్ బ్యాటర్ లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్ పదహారో సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడిన దాస్.. కుటుంబ సమస్యల కారణంగా లీగ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. ఈ విషయాన్ని కోల్‌కతా ట్విట్టర్లో అధికారికంగా ధ్రువీకరించింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా లిటన్ దాస్ స్వదేశానికి పయనమయ్యాడని కేకేఆర్ పేర్కొంది. ఈ కష్ట సమయం నుంచి అతడు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కాగా, గతేడాది జరిగిన వేలంలో యాక్సిలరేటెడ్ రౌండ్లో కనీస ధర రూ.50 లక్షలకు లిటన్ దాస్‌ను కేకేఆర్ కొనుక్కుంది. ఈ సీజన్లో ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మ్యాచ్‌లో నాలుగు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు.
#IPL2023: Two-time IPL champions #KolkataKnightRiders announced that #Bangladesh wicketkeeper-batter #LittonDas has flown back home earlier on Friday because of a family emergency. pic.twitter.com/PdTh36vLqp
— IANS (@ians_india) April 28, 2023