ఐపీఎల్ స్టార్టయింది. తొలి మ్యాచ్ లోనే ఆర్సీబీని గెలిపించిన కోహ్లీ.. అదే ఊపులో రెండు సరికొత్త రికార్డులు కూడా నమోదు చేశాడు. ఇంతకీ అవేంటో తెలుసా?
విరాట్ కోహ్లీ అంటేనే రికార్డులు! లేకపోతే ఏంటి మరి.. టీమిండియా తరఫున ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతల్ని సాధించిన ఇతడు.. ఐపీఎల్ లోనూ ఆల్రెడీ కొన్ని రికార్డులు తన పేరిట నమోదు చేశాడు. అయినా సరే ఇంకా దాహం తీరినట్లు లేదు. తాజాగా ప్రారంభమైన కొత్త సీజన్ లోనూ తొలి మ్యాచ్ లోనే సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆర్సీబీని గెలిపించడమే కాదు.. ఆ విషయంలో ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మని వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో కోహ్లీ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ ఊపు కొనసాగించాడు. 6 ఫోర్లు, 5 సిక్సులతో ఏకంగా 82 పరుగులు చేసి వావ్ అనిపించాడు. 8 వికెట్ల తేడాతో ఆర్సీబీని తొలి మ్యాచులో గెలిపించాడు. ఈ క్రమంలోనే తన పేరిట రెండు సరికొత్త రికార్డులని సృష్టించాడు. ఈ పోరులో హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. ఐపీఎల్ లో 50వ అర్ధ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ మార్క్ ని అందుకున్న తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. మొత్తంగా రెండో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 45 హాఫ్ సెంచరీలతో పాటు 5 సెంచరీలు చేశాడు. ఇతడి కంటే ముందు వార్నర్.. 60 హాఫ్ సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.
మరోవైపు ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఆర్సీబీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఆర్సీబీ. అభిమానులకు బెంగళూరు పేరు చెప్పగానే ఇది మాత్రమే గుర్తొస్తుంది. అలా ఈ జట్టుకు ఆడి ఇప్పుడు విరాట్ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ ఓపెనర్ గా ఏకంగా 3000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గానూ నిలిచాడు. బహుశా ఈ మార్క్ ని వేరే జట్టులోని ఎవరూ కూడా ఇప్పట్లో బీట్ చేసే ఛాన్స్ అయితే అస్సలు కనిపించట్లేదు. అలా ఐపీఎల్-2023లో అడుగుపెట్టడంతోనే కోహ్లీ రెండు సరికొత్త రికార్డులని నమోదు చేశాడు. మరి దీనిపై మీరేం అనుకుంటున్నాడు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
What a Picture…
The King Kohli made Jofra Archer helpless!#ViratKohli #Kohli #RCBvsMI #RCBvMI #MIvsRCB #MIvRCB pic.twitter.com/LqUulqiCqI
— Vishwajit Patil (@_VishwajitPatil) April 2, 2023