క్రీడా ప్రపంచంలో IPL కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో ఆడాలని వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రతీ క్రికెటర్ కల. అందుకే ఐపీఎల్ ఆడటానికి విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ మార్చిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం(డిసెంబర్ 23) న.. కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరిగింది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టేశారు. ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక ఈ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయిన ఓ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్, భాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్. ఆ ఆటగాడు దమ్మున్న క్రికెటర్ అని, అందుకే అతడికి అన్ని కోట్లు పెట్టారని చెప్పుకొచ్చాడు.
కేరళలోని కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో విదేశీ ఆటగాళ్లు సత్తా చాటారు సామ్ కర్రన్, కామెరూన్ గ్రీన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్ లు భారీ ధర పలికి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ వేలంలో అదరిని ఆశ్చర్య పరిచింది మాత్రం వెస్టిండీస్ ఆటగాడు అయిన పూరన్ వేలం అనే చెప్పాలి. గత ఐపీఎల్ లో దారుణంగా విఫలం అయిన అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. పూరన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సైతం పోటీపడింది. ఈ నేపథ్యంలోనే దారుణమైన ఫామ్ లో ఉన్న పూరన్ ను ఎందుకు అంతపెట్టి కొన్నామో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వివరించాడు.
Welcome to the #SuperGiant family @nicholas_47! 😍#IPL2023 | #IPLAuction | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/sHW6KEjUKX
— Lucknow Super Giants (@LucknowIPL) December 23, 2022
వేలం అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడుతూ..”నికోలస్ పూరన్ సాధారణమైన ఆటగాడు ఏమీ కాదు. ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించే దమ్మున్న ప్లేయర్. అందుకే అతడిని అంత భారీ ధరకు కొన్నాం. ఇక గతం గురించి మాకు అనవసరం. అతడిపై మాకున్న నమ్మకంతోనే కొనుగోలు చేశాం. పూరన్ లాంటి ఆటగాడి కోసమే , ప్రణాళికతోనే వేలానికి వచ్చాం” అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా పూరన్ కు ఇప్పుడు 27 సంవత్సరాలే అని, ఇక్కడి నుంచి అంతడి కెరీర్ ఊపందుకుంటుందని గౌతీ అన్నాడు. అయితే ఐపీఎల్ లో ఎన్ని పరుగులు చేశామా? అన్నది ముఖ్యం కాదని ఎంత ప్రభావం చూపమనేదే ముఖ్యమని ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
ఇక పూరన్ గత రెండు ఐపీఎల్ సీజన్లలో పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడి దారుణంగా విఫలం అయ్యాడు. 12 మ్యాచ్ ల్లో 85 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే 2022 వేలంలో పూరన్ ను రూ. 10.75 కోట్లకు హైదరాబాద్ సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన పూరన్ 306 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ వేలంలో అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. చూడాలి మరి తనమీద పెట్టిన పైసలకు ఎంతమేరకు న్యాయం చేస్తాడో. పూరన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సైతం చివరి వరకు పోరాడటం విశేషం.
A long bidding war between multiple franchises for Nicholas Pooran.
Lucknow finally lands him for Rs. 16 crore. 🔥#IPL2023Auction pic.twitter.com/3otmcGvAoN
— 100MB (@100MasterBlastr) December 23, 2022