చెన్నై జట్టు ఐపీఎల్ కప్ గెలిచింది. ధోనీ కెప్టెన్సీలో ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. కానీ సీఎస్కే కప్ కొట్టడానికి కారణం బీజేపీ అని ఈ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్ చేశారు.
దాదాపు రెండు నెలలపాటు మనందరినీ ఫుల్ గా ఎంటర్ టైన్ చేసిన ఐపీఎల్ పూర్తయిపోయింది. ఆదివారంతోనే అయిపోవాల్సింది. కానీ వర్షం వల్ల ఫైనల్ ని దాదాపు మూడు రోజుల పాటు జరిపారు. ఇందులో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో సీఎస్కే ఖాతాలో ఐదో ట్రోఫీ వచ్చి చేరింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్వయానా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నై జట్టు కప్ కొట్టడానికి బీజేపీనే కారణమని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే అందరి మధ్య డిస్కషన్ కి కారణమైంది. ఇంతకీ అసలేం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ జరిగింది. గుజరాత్-చెన్నై జట్లు తలపడ్డాయి. ఆదివారం మ్యాచ్ జరగాల్సింది. వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడలేదు. దీంతో రిజర్వ్ డేకి మార్చారు. అంటే సోమవారం మ్యాచ్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత మళ్లీ వర్షం పడింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు మ్యాచ్ ఆగిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చెన్నైకి 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేశారు. దాన్ని పూర్తిచేసిన చెన్నై.. ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా ధోనీ, సీఎస్కే ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘బీజేపీ కార్యకర్త రవీంద్ర జడేజా వల్లే సీఎస్కే గెలిచింది. కప్ సాధించినందుకు సీఎస్కేకు అభినందనలు’ అని అన్నామలై ట్వీట్ చేశారు. ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ యాంకర్ తో మాట్లాడుతూ.. ‘సీఎస్కే గెలిచినందుకు గర్వపడుతున్నాను. అయితే చెన్నైలో కంటే గుజరాత్ జట్టులోనే ఎక్కువమంది తమిళ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి గుజరాత్ జట్టుతో పాటు ప్రజలు సంబరాలు చేసుకోవాలి’ అని అన్నామలై చెప్పారు. గతేడాది గుజరాత్ ఎన్నికల సందర్భంగా రవీంద్ర జడేజా, అతడి భార్య రివాబా జడేజా.. బీజేపీలో చేరారు. ఇప్పుడు చెన్నై కప్ గెలవడంతో ఈ విషయాన్ని, రాజకీయ పార్టీకి లింక్ చేసి మాట్లాడుతున్నారు. మరి సీఎస్కే కప్ గెలుచుకోవడానికి బీజేపీ కార్యకర్త కారణమని ఓ భాజాపా నేత వ్యాఖ్యలు చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్స్ చేయండి.
கிரிக்கெட் வீரர் ஜடேஜா ஒரு பாஜக காரியகர்த்தா. அவர் மனைவி திருமதி.ரிவபா ஜாம்நகர் வடக்கு தொகுதி பாஜக சட்டமன்ற உறுப்பினர். மேலும் அவர் குஜராத்காரர்!
பாஜக காரியகர்த்தா ஜடேஜா தான் CSKவிற்கு வெற்றியை தேடி தந்துள்ளார்
– மாநில தலைவர்
திரு.@annamalai_k#CSK #Annamalai #9YearsOfSeva pic.twitter.com/zvy6B2eUlg— BJP Tamilnadu (@BJP4TamilNadu) May 30, 2023